జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌ | Reliance Jio Prime Membership Ends Tomorrow | Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌

Mar 30 2018 7:13 PM | Updated on Mar 30 2018 7:36 PM

Reliance Jio Prime Membership Ends Tomorrow - Sakshi

రిలయన్స్‌ జియో ప్రైమ్‌ సభ్యత్వం తుది గడువు రేపటితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో తన ప్రస్తుత జియో ప్రైమ్‌ మెంబర్లకు జియో గుడ్‌న్యూస్‌ చెప్పింది. అదనంగా ఏడాది పాటు కాంప్లిమెంటరీ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను అందియనున్నట్టు జియో ప్రకటించింది. ఇంకా ఒక్క రోజుల్లో తన ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో జియో ఈ గుడ్‌న్యూస్‌ చెప్పింది. మైజియో యాప్‌లోకి లాగిన్‌ అయి జియో మెంబర్లు కాంప్లిమెంటరీ జియో మెంబర్‌షిప్‌ను ఎంచుకుంటే, మరో ఏడాది పాటు కాంప్లిమెంటరీ ఫ్రీ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. కాగ, గతేడాది జియో 99 రూపాయలతో ఈ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త జియో యూజర్లకు కూడా ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధర అదేవిధంగా ఉంటుందని జియో తెలిపింది. అంటే కొత్త యూజర్లు రూ.99 చెల్లించి ప్రస్తుతం ఈ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందాల్సి ఉంటుంది. పాత యూజర్లకు మాత్రానికి ఉచితంగా మరో ఏడాది పాటు ఈ సర్వీసులను పొడిగించుకోవచ్చు.
  
గతేడాది తీసుకొచ్చిన జియో ప్రైమ్‌, రిలయన్స్‌ జియో కస్టమర్లకు ఏడాది సభ్యత్వం లాంటిది. దీనిలో ఎవరైతే రూ.309 లేదా ఆపై మొత్తాల రీఛార్జ్‌తో పాటు వన్‌-టైమ్‌ వార్షిక ఫీజు కింద 99 రూపాయలు చెల్లించారో వారికి ఈ సభ్యత్వం కల్పించింది. ఈ ఎన్‌రోల్‌మెంట్‌తో పలు ప్రయోజనాలను యూజర్లు పొందుతారు. కేవలం 399 రూపాయల ఛార్జ్‌తోనే ఉచితంగా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను, ఎస్‌ఎంఎస్‌లను, 4జీ డేటాను యూజర్లు 70 రోజుల పాటు పొందవచ్చు.  జియో ప్రైమ్ యూజర్లు కొన్ని ప్రత్యేక ప్లాన్స్‌ను కూడా ఉన్నాయి. అంతేకాక ఏడాది పాటు వెయ్యి రూపాయల విలువైన జియో ప్రీమియం కంటెంట్‌ను పొందవచ్చు. ఎప్పటికప్పుడు జియో ప్రైమ్‌ యూజర్లకు ఆఫర్లను, డీల్స్‌ను జియో ప్రకటిస్తూ వచ్చింది. అంతేకాక జియో యాప్స్‌ అన్ని ఉచితంగా లభించాయి. ఈ యాప్స్‌తో మూవీస్‌, వీడియో లాంటి మ్యూజిక్‌, కంటెంట్‌ను యూజర్లు ఉచితంగా పొందుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement