రిలయన్స్‌ జియోమనీతో ఉబెర్‌ జట్టు | Reliance Jio and Uber announce strategic partnership | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జియోమనీతో ఉబెర్‌ జట్టు

Feb 21 2017 1:44 AM | Updated on Sep 5 2017 4:11 AM

రిలయన్స్‌ జియోమనీతో ఉబెర్‌ జట్టు

రిలయన్స్‌ జియోమనీతో ఉబెర్‌ జట్టు

టెలికం సంస్థ రిలయన్స్‌ జియో తాజాగా ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌తో చేతులు కలిపింది.

ముంబై: టెలికం సంస్థ రిలయన్స్‌ జియో తాజాగా ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌తో చేతులు కలిపింది. జియో యూజర్లు ఇకపై రిలయన్స్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌కి చెందిన ప్రీపెయిడ్‌ వాలెట్‌ జియోమనీ యాప్‌ ద్వారా ఉబెర్‌ ట్యాక్సీలను బుక్‌ చేసుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది.

జియోమనీ ద్వారా ఉబెర్‌ ట్యాక్సీ సేవలకు చెల్లింపులు జరిపేవారికి ఇరు సంస్థలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు జియోమనీ బిజినెస్‌ హెడ్‌ అనిర్బన్‌ ముఖర్జీ తెలిపారు. దేశీ యూజర్లకు మరింత మెరుగైన డిజిటల్‌ సర్వీసులు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఉబెర్‌ నూతన చీఫ్‌ బిజనెస్‌ ఆఫీసర్‌ (భారత విభాగం) మధు కన్నన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement