ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలకు నిబంధనలు 

Regulations for drug sales online - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయానికి సంబంధించి పాటించాల్సిన నియంత్రణలపై కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. వీటిని ఇప్పటికే ప్రచురించినట్లు, డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ రూల్స్‌లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌ మాండవీయా లోక్‌సభకు తెలిపారు.

ఈ ముసాయిదా ప్రకారం.. రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టు పేరు, వారి రిజిస్ట్రేషన్‌ నంబరు, వారు నమోదు చేయించుకున్న ఫార్మసీ కౌన్సిల్‌ పేరు మొదలైనవన్నీ కూడా ఈ–ఫార్మసీలు తమ పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఔషధ రంగాలో పారదర్శకతను తీసుకురావడమే ఈ నిబంధనల లక్ష్యమని తెలిపారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top