రూ. 2799లకే రెడ్‌మి నోట్‌ 6ప్రొ?

Redmi Note6 Pro Unbelievable Price Cut - Sakshi

సాక్షి,ముంబై:  చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షావోమి తన  లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ధరనుఅతి తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ద్వారా రూ.2799 లకే లభ్యం కానుందని ఎంఐ ఇండియా ట్విటర్‌లో వెల్లడించింది. పరిమితకాల ఆఫర్‌గా ఈ డిస్కౌంట్‌ అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే నిబంధనలు వర్తిస్తాయని కూడా పేర్కొంది. అయితే  ఫ్లిప్‌కార్ట్‌లో వెబ్‌సైట్‌  రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ధర రూ.13,999గా నే కనిపిస్తుండటం గమనార్హం. 

మరోవైపు హై5 పేరుతో తన స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్న షావోమి అయిదవ ఆఫర్‌గా తాజాగా రెడ్‌మి 6పై తగ్గింపును ప్రకటించింది. ‘‘ఫెంటాస్టిక్‌ ఫ్రైడే1500 రూపాయల దాకా తగ్గింపు’’ను అందిస్తున్నట్టు ట్వీట్‌ చేసింది. ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా 3జీబీర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.7999గా పేర్కొంది. అలాగే 3జీబీర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.8999గా వెల్లడించింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top