30 నిమిషాల్లో ఖతం..బుకింగ్స్‌ క్లోజ్‌

 Record sale Samsung  Galaxy Fold phones sold 30 mins in India - Sakshi

లగ్జరీ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ రికార్డు  ప్రీ బుకింగ్స్‌

మొత్తం 1600  అల్ట్రా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు బుక్‌

కేవలం 30నిమిషాల్లో మొత్తం సేల్‌

సాక్షి, ముంబై :  స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో భారీ వాటాను సొంతం చేసుకున్న భారత్‌ లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల విక్రయంలో రికార్డు నెలకొల్పింది.  దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్‌ ఇటీవల  లాంచ్‌ చేసిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ విక్రయాల్లో కొత్త రికార్డు సృష్టించింది.  ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే  సూపర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ హాట్‌ కేకుల్లా బుక్‌ అయిపోయాయి. శుక్రవారం అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు  మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం ఫోన్‌లను కంపెనీ విక్రయించింది. దీంతో  ప్రీ-బుకింగ్స్‌ను మూసివేసింది. వార్తా సంస్థ ఐఎఎన్‌ఎస్‌ అందించిన  నివేదిక ప్రకారం, ఫోన్‌లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం రూ. 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం.  అక్టోబర్ 20న  ఇవి వినియోగదారుల చేతికి రానున్నాయి. 

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ గెలాక్సీ ఫోల్డ్ ఆరు కెమెరాలతో వస్తుంది. 4.6-అంగుళాల సింగిల్‌ ఫోల్డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే. ఇది విప్పినప్పుడు 7.3 అంగుళాల వరకు విస్తరిస్తుంది. బయటి 21: 9 స్క్రీన్ 840x1960 రిజల్యూషన్ , మరో స్క్రీన్ 1,536 x 2,152 రిజల్యూషన్ కలిగి ఉంది.  ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ ఫీచర్లు
7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లే
12 జీబీ రామ్‌, 512 జీబీ  స్టోరేజ్‌
కవర్‌ డిస్‌ప్లేపై 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఇంటర్నల్‌ డిస్‌ప్లేపై 10 ఎంపీ,
8 ఎంపీ కెమెరాలు
వెనుకవైపు 16 ఎంపీ, 12 ఎంపీ,
12 ఎంపీ ట్రిపుల్‌ కెమెరాలు
4380 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top