సిటీ బ్యాంకుకు భారీ జరిమానా

RBI slaps Rs 3 crore penalty on Citibank India - Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సిటీ బ్యాంకు భారీ షాక్‌ ఇచ్చింది. అమెరికా ప్రధాన కేంద్రంగా సేవలు అందించే సిటీ బ్యాంకుకు భారతీయ రిజర్వు బ్యాంకు రూ.3 కోట్లు జరిమానా విధించింది. 'ఫిట్-అండ్-సబ్జెక్ట్ క్రైటీరియా'కు సంబంధించి సూచనలను పాటించలేదంటూ ఆర్‌బీఐ పెనాల్టీ విధించింది. ఆదేశాల మేరకు డైరెక్టర్ల నియామకంలో నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారమని రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

సమర్థులైన డైరెక్టర్లను నియమించాలని, సరైన అర్హతలుండాలని ఆర్బీఐ గతంతో బ్యాంకును ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించక పోవడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2019, జనవరి 3న ఆర్బీఐ రూ.3 కోట్లు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే  వినియోగదారుల లావాదేవీలతో ఈ జరిమానాకు ఎలాంటి సంబంధం లేదని రిజర్వ్‌బ్యాంకు స్పష్టం చేసింది. 

కాగా అమెరికా ఆధారిత సిటీబ్యాంక్ 115 సంవత్సరాలుగా భారతదేశంలో పనిచేస్తోంది. భారత్‌లో సిటీ బ్యాంకుకు 35 బ్రాంచీలు, 541 ఎటిఎంల నెట్‌వర్క్‌లు ఉన్నాయి. మరోవైపు గత జులై జూలై 2013 లో,  కేవైసీ నిబంధనలు, అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన సూచనల ఉల్లంఘనకు సిటీబ్యాంకు "హెచ్చరిక లేఖ" జారీ చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top