ట్రెండ్స్‌కు అంబాసిడర్‌గా రానా

Rana Daggubati turns brand ambassador for Reliance Trends - Sakshi

‘గెట్ దెమ్ టాకింగ్‌’ పేరుతో స‌రికొత్తగా ప్ర‌చారం

సాక్షి, హైద‌రాబాద్‌ : రిలయన్స్ రిటైల్‌లో దుస్తులు, ఉప‌క‌ర‌ణాల‌ ప్ర‌త్యేక విభాగమైన ట్రెండ్స్‌, తన బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా టాలీవుడ్ న‌టుడు దగ్గుబాటి రానా ద‌గ్గుబాటిని నియ‌మించుకున్న‌ట్లు బుధ‌వారం వెల్ల‌డించింది. ఇందులో భాగంగా.. బేగంపేట్‌లోని ట్రెండ్స్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో ఫ‌స్ట్‌లుక్ ప్ర‌చారం ‘గెట్‌ దెమ్ టాకింగ్‌’ను ప్ర‌ద‌ర్శించింది. మార్చి 1, 2018 నుంచి రానా ట్రెండ్స్ కొత్త టీవీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా  కొన‌సాగ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా రానా ద‌గ్గుబాటి మ‌ట్లాడుతూ.. ట్రెండ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప‌నిచేయ‌టం సంతోషంగా ఉందన్నారు. సామాన్య ధ‌ర‌ల‌కే అద్భుత‌మైన ఫ్యాష‌న్స్‌ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందులో ఫ్యాష‌న్ ఉత్ప‌త్తులన్నీ ప్ర‌త్యేకంగా అంత‌ర్జాతీయ ట్రెండ్స్‌కు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు.  ట్రెండ్స్ మార్కెటింగ్ హెడ్, క‌పిల్ ఖ‌ట్ట‌ర్ మాట్లాడుతూ.. రానా ద‌గ్గుబాటికి మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ఉందని, న‌టుడిగా అద్భుత‌మైన న‌ట‌నా కౌశ‌లం, వైవిధ్యం, ఫ్యాష‌న్‌ ఆయ‌న సొంతమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణల్లో ట్రెండ్స్ ఫ్యాష‌న్ కేంద్రంగా మారిందనన్నారు. ట్రెండ్స్‌కు ఏపీ తెలంగాణాల్లో 60కి పైగా స్టోర్స్ ఉన్నాయని తెలిపారు. యువ‌త అనుగుణంగా ట్రెండ్స్‌లో ఫ్యాష‌న్ ఉత్పత్తుల‌ను పొందుప‌రుస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top