రామ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రానా | Rana as Brand Ambassador for Ramraj Cotton | Sakshi
Sakshi News home page

రామ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రానా

Sep 14 2017 12:29 AM | Updated on Aug 11 2019 12:52 PM

రామ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రానా - Sakshi

రామ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా రానా

దుస్తుల తయారీ సంస్థ రామ్‌రాజ్‌ కాటన్‌ తన కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నటుడు, నిర్మాత దగ్గుబాటి రానాను నియమించుకుంది. రామ్‌రాజ్‌ బనియన్లకు ఆయన ప్రచారకర్తగా ఉంటారు.

దుస్తుల తయారీ సంస్థ రామ్‌రాజ్‌ కాటన్‌ తన కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నటుడు, నిర్మాత దగ్గుబాటి రానాను నియమించుకుంది. రామ్‌రాజ్‌ బనియన్లకు ఆయన ప్రచారకర్తగా ఉంటారు. పంచెల విక్రయాల్లో ఇప్పటికే నంబర్‌ వన్‌గా ఉన్నామని, బనియన్ల విపణిలో అగ్రస్థానానికి చేరుకోవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు కె.ఆర్‌.నాగరాజన్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలి పారు. ‘82 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు, 6,000కు పైగా మల్టీ బ్రాండ్‌ ఔట్‌లెట్లతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాం. ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల్లోనూ ఇటువంటి కేంద్రాలను నెలకొల్పనున్నాం.

తమిళనాడులో మూడు తయారీ కేంద్రాలున్నాయి. ప్లాంటు పెట్టాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాలు ఆహ్వానించాయి. ఎక్కడ కొత్త ప్లాంటు పెట్టాలి అన్న విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. గతేడాది రూ.1,200 కోట్లు ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. టర్నోవరులో బనియన్ల వాటా 30 శాతం ఉంది. దీనిని 50 శాతానికి చేరుస్తాం’ అని వివరించారు. విదేశాలకు సొంత బ్రాండ్‌తో దుస్తులను ఎగుమతి చేస్తున్న కంపెనీకి ప్రచారకర్తగా ఉండడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా రానా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement