రాంకీ నుంచి 4 ప్రాజెక్ట్‌లు | Ramky estates starts new projects | Sakshi
Sakshi News home page

రాంకీ నుంచి 4 ప్రాజెక్ట్‌లు

Apr 6 2019 12:04 AM | Updated on Apr 6 2019 12:04 AM

Ramky estates starts new projects - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాంకీ ఎస్టేట్స్‌ అండ్‌ ఫామ్స్‌ దక్షిణాదిలో శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో 3, చెన్నైలో 1 సరికొత్త ప్రాజెక్ట్‌తో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. నల్లగండ్లలో ఇప్పటికే రాంకీ వన్‌ గెలాక్సియా ప్రాజెక్ట్‌ను నిర్మించిన రాంకీ.. తాజాగా ఫేజ్‌–2 ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. జీ+14 అంతస్తుల నిర్మాణంలో 2 బ్లాక్స్‌లో మొత్తం 412 యూనిట్లుంటాయి. 1265 నుంచి 1665 చ.అ. విస్తీర్ణాల్లో 2, 3 బీహెచ్‌కే గృహాలను నిర్మిస్తుంది. 
     
మహేశ్వరంలోని రాంకీ డిస్కవరీ సిటీలో ది హడ్లీ పేరిట క్లస్టర్‌ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. 9.98 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 125 విల్లాలుంటాయి. విస్తీర్ణాలు 174 నుంచి 402 గజాల్లో ఉంటాయి. ప్రారంభ ధర రూ.1.05 కోట్లు. ఇదే ప్రాంతంలో 3.81 ఎకరాల్లో గ్రీన్‌ వ్యూ అపార్ట్‌మెంట్స్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 200 ఫ్లాట్లు. 1130 నుంచి 2060 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రారంభ ధర రూ.46 లక్షలు. 
     
చెన్నైలోని కలీకుప్పంలో 1.31 ఎకరాల్లో లెమన్‌గ్రాజ్‌ (ఆర్‌డబ్ల్యూడీ) ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 129 గృహాలు. 1047 నుంచి 1498 చ.అ. మధ్య 2, 3 బీహెచ్‌కే గృహాలుంటాయి. 
     
రాంకీ ఎస్టేట్స్‌ అండ్‌ ఫామ్స్‌ గత రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాల్లో 80 లక్షల చ.అ.ల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించింది. వీటిల్లో లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు, హై, మిడ్, లో రైజ్‌ అపార్ట్‌మెంట్లు, కాంటెంపరరీ వాణిజ్య సముదాయాల ప్రాజెక్ట్‌లున్నాయి. 
   
ప్రస్తుతం కోటి చ.అ.ల్లో పలు నివాస ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. 20 లక్షల చ.అ.ల్లో పలు ప్రాజెక్ట్‌లు ప్రారంభ దశలో ఉండగా.. మరొక 1.8 కోట్ల చ.అ.లో ప్రాజెక్ట్‌లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement