ప‌బ్జీ గేమ్ చైనాదా? తెలుసుకోండి..

PUBG is Not A Chinese Game - Sakshi

న్యూఢిల్లీ: "చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించాలి" అన్న నినాదం దేశ‌వ్యాప్తంగా రాజుకుంది. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దులో చోటు చేసుకున్న‌ ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌ర‌వీరుల‌వ‌డంతో దేశ‌మంతా చైనా వ్య‌తిరేక ఉద్య‌మం మ‌రింత ఊపందుకుంది. ఈ క్ర‌మంలో చైనా వ‌స్తువుల‌ను నిషేధించ‌డంతోపాటు చైనా యాప్‌ల‌ను వాడొద్దన్న వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో యువ‌త ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ప‌బ్జీ గేమ్ చైనాదా? అన్న ప్ర‌శ్న ఎంతోమందికి వ‌చ్చింది. ఇప్పుడు దాన్ని డిలీట్ చేయాల్సిందేనా అని ఎంతోమంది గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టాయి. అస‌లే లాక్‌డౌన్‌లో ఫోన్ల‌కు మ‌రింత అతుక్కుపోయి ప‌బ్జీని విచ్చ‌ల‌విడిగా వాడుతున్నారు. ఈ స‌మ‌యంలో దాన్ని డిలీట్ చేయాలంటే మ‌న‌సొప్ప‌క‌పోవ‌డంలో త‌ప్పేమీ లేదు. (‘రిమూవ్‌ చైనా యాప్స్‌’కు)

దీంతో అస‌లు ప‌బ్జీ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందంటూ అంద‌రూ గూగుల్‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీనికి సమాధామేంటంటే... సాంకేతికంగా అయితే పబ్జీ అస‌లు చైనాదే కాదు. దీన్ని ఐర్‌లాండ్‌కు చెందిన బ్రెద‌ర్ గ్రీన్ అనే వ్య‌క్తి డెవ‌ల‌ప్ చేశాడు. ఈ గేమ్‌ను ద‌క్షిణ కొరియాలోని బ్లూహోల్ డెస్క్‌టాప్స్‌పై అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ వ‌ర్ష‌న్‌లోకి తీసుకొచ్చేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ అనే కంపెనీ సాయం చేస్తూనే బ్లూ హోల్‌లో 10 శాతం వాటాను తీసుకుంది. అంత‌కుమించి ప‌బ్జీకి చైనాతో ఎలాంటి సంబంధం లేదు. అంత‌దాకా ఎందుకు? ఈ గేమ్‌లో తీవ్ర హింస ఉంద‌ని చైనాలో పబ్జీని రిలీజ్ చేయ‌కముందే బ్యాన్ చేశారు కూడా. కాబ‌ట్టి ఈ గేమ్‌కు చైనాకు సంబంధ‌మే లేదు. (పబ్జీకి బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top