అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్‌..!

The Possibility Of A Trade Agreement Between The US And China - Sakshi

అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా

వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం

గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వెల్లడి

ఈ వారంలో రేంజ్‌ బౌండ్‌కు చాన్స్‌!

ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెపె్టంబర్‌) ఫలితాల సీజన్‌ దాదాపుగా పూరైయిన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలే ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా–చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని శ్వేతసౌధానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఇది అధ్యక్షుల స్థాయిలోనే ఉండగా.. కేవలం మంత్రులు మాత్రమే దీనిపై సంతకాలు చేస్తారని తెలియజేశారు. ఈ సానుకూల వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్‌ సూచీలు శుక్రవారం 0.80 శాతం లాభపడి జీవితకాల గరిష్టస్థాయిలకు చేరుకున్నాయి.

అయితే, ఒప్పందం అంశంపై శని, ఆదివారాల్లో పూర్తి స్పష్టత లేనందున దేశీయంగా మార్కెట్‌ వర్గాలు ఆ రెండు దేశాల ప్రకటనలపై దృష్టిసారించారని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు చెబుతున్నారు. ‘దేశీయంగా మార్కెట్‌ను నడిపించే ప్రధానాంశాలేవీ లేకపోవడం వల్ల అమెరికా–చైనాల మధ్య వాణిజ్య చర్చల వంటి అంతర్జాతీయ అంశాలే ఈవారం కీలకం కానున్నాయి. ట్రేడింగ్‌ రేంజ్‌ బౌండ్‌కే పరిమితం కానుందని అంచనావేస్తున్నాం’ అని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ విశ్లేషిశించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం పూర్తయితే మాత్రం దేశీ సూచీలు సైతం ఆల్‌ టైం హైని నమోదుచేయవచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు.   

అమెరికా ఆర్థిక గణాంకాల ప్రభావం..
ఫెడ్‌ అక్టోబర్‌ పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) ఈనెల 21న (గురువారం) ప్రకటించనుంది. గతనెలకు చెందిన యూఎస్‌ రిటైల్‌ విక్రయాల డేటా 15న వెల్లడికానుండగా.. మార్కిట్‌ తయారీ పీఎంఐ, సర్వీసెస్ పీఎంఐ 22న వెల్లడికానున్నాయి. కాగా దేశీయంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నవంబర్‌ 18 (సోమవారం) ప్రారంభం కానుండగా.. తాజా ఉద్దీపనలు ఏవైనా ఉంటే మాత్రం మార్కెట్‌కు సానుకూలం అవుతుందని భావిస్తున్నారు.

క్రూడ్‌ ధర పెరిగింది
ముడి చమురు ధరలు వారాంతాన ఒక్కసారిగా లాభపడ్డాయి. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్ఛంజ్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ (జనవరి డెలివరీ) శుక్రవారం 1.70 శాతం లాభపడి 63.34 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావంతో డాలరుతో రూపాయి మారకం విలువ 18 పైసలు నష్టపోయి 71.78 వద్దకు బలహీనపడింది. ప్రస్తుతం రూపాయి ట్రెండ్‌ బలహీనంగానే ఉందని, 71.50 వద్ద రెసిస్టెన్స్‌ ఎదుర్కోనుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌  విశ్లేషకులు స్ట్రాటజీ వీకే శర్మ అన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top