మార్కెట్‌లోకి రూ 1.31 కోట్ల ఖరీదైన పోర్షే కారు..

న్యూఢిల్లీ : ప్రముఖ లగ‍్జరీ కార్ల బ్రాండ్ పోర్షే దేశీ మార్కెట్‌లో రూ 1.31 కోట్ల ఖరీదైన కయెన్ కూపేను లాంఛ్ చేసింది. ఈ మోడల్ వీ8 వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ 1.97 కోట్లు పలకనుంది. వీ6 వేరియంట్ రూ 1.31 కోట్లకు అందుబాటులో ఉంటుంది. అన్ని పోర్షే కార్ల తరహాలోనే కయెన్ కూపే కూడా భారతదేశంలో పూర్తిగా నిర్మించిన యూనిట్ (సిబియు)గా సేల్‌కు సిద్ధమైంది. ఇది యూరోపియన్ మోడల్‌కు దీటుగా ఉంటుంది. సరికొత్త పోర్షే కయెన్ కూపేలో పోర్షే ఫీచర్లతో పాటు అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి