ప్లాస్టో బ్రాండ్‌ అంబాసిడర్‌గా హృతిక్‌ రోషన్‌ | Plasto Brand Ambassador Hrithik Roshan | Sakshi
Sakshi News home page

ప్లాస్టో బ్రాండ్‌ అంబాసిడర్‌గా హృతిక్‌ రోషన్‌

Jul 4 2017 1:10 AM | Updated on Mar 22 2019 7:19 PM

ప్లాస్టో బ్రాండ్‌ అంబాసిడర్‌గా హృతిక్‌ రోషన్‌ - Sakshi

ప్లాస్టో బ్రాండ్‌ అంబాసిడర్‌గా హృతిక్‌ రోషన్‌

దేశీ ప్రముఖ వాటర్‌ ట్యాంకులు, పైపుల తయారీ కంపెనీ ‘ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌’ తాజాగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌..

హైదరాబాద్‌: దేశీ ప్రముఖ వాటర్‌ ట్యాంకులు, పైపుల తయారీ కంపెనీ ‘ఆర్‌సీ ప్లాస్టో ట్యాంక్స్‌ అండ్‌ పైప్స్‌’ తాజాగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఇక నాగ్‌పూర్‌లోని ప్లాస్టో ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్‌ లొకేషన్‌ ట్యాంక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా అవతరించిందని కంపెనీ పేర్కొంది.

ఈ యూనిట్‌లో 2016–17లో మొత్తంగా 60 కోట్లకు పైగా లీటర్ల వాటర్‌ ట్యాంక్‌లను తయారు చేసినట్లు తెలిపింది. కాగా ప్లాస్టో కంపెనీ 225 లీటర్లు నుంచి 10,000 లీటర్ల సామర్థ్యంలో 3, 4 లేయర్‌ ట్యాంక్‌లను, పైపులను తయారు చేస్తుంది. హృతిక్‌ రోషన్‌ను ప్లాస్టో బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకోవడం ఆనందంగా ఉందని కంపెనీ డైరెక్టర్లు నీలేశ్‌ అగర్వాల్, విశాల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement