ధరల వాత : రికార్డ్‌ స్థాయిల్లో పెట్రోల్‌, డీజిల్‌ | Petrol Price Highest In Nearly 5 Years, Diesel At Record High | Sakshi
Sakshi News home page

ధరల వాత : రికార్డ్‌ స్థాయిల్లో పెట్రోల్‌, డీజిల్‌

May 15 2018 9:48 AM | Updated on Jul 6 2019 3:20 PM

Petrol Price Highest In Nearly 5 Years, Diesel At Record High - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. కర్ణాటక ఎన్నికల  ఫలితాల ఒకవైపు కొనసాగుతుండగా.. వరుసగా రెండో రోజు కూడా  పెట్రోల్‌, డీజిల్ ధరలు మంగళవారం పెరిగాయి.   పెట్రో ధర లీటరుకు  15పైసలు పెరగా, డీజిల్‌ ధర లీచరుకు   22 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర తాజాగా 56 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. డీజిల్ ధరలది  కూడా ఇదే ధోరణి .  తాజాగా మరో ఆల్‌టైం హైని టచ్‌   చేసింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్  వెబ్‌సైట్‌ అందించిన వివరాల ప్రకారం ఢిల్లీలో పెట్రోలు లీటరుకు రూ. 74.95,కోలకతా  77.65 రూపాయలు, ముంబైలో 82.79 రూపాయలు,  చెన్నైలో 77.77 రూపాయలుగా ఉంది.   డీజిల్ ధరలు  వరుసగా రూ. 66.36 లీటరు, రూ. 68.9, రూ.70.66, రూ.  70.02గా  ఉన్నాయి.  మే 15 న ఉదయం 6 గంటల నుంచి  ఈ ధరలు అమల్లోకి వచ్చాయి.  

 

Advertisement
 
Advertisement
Advertisement