ఆడి క్యూ7 పెట్రోల్‌ వెర్షన్‌..ధర ఎంత?

ఆడి క్యూ7 పెట్రోల్‌ వెర్షన్‌..ధర ఎంత?


సాక్షి, ముంబై: జర్మనీ లగ్జరీ కార్‌ మేకర్‌ ఆడి క్యూ7 లో పెట్రోల్‌ వెర్షన్‌ కారును లాంచ్‌ చేసింది. 2.0లీటర్‌  పెట్రోల్‌  ఇంజీన్‌  సామర్ధ్యంతో   ‘క్యూ7 40 టీఎఫ్‌ఎస్‌’  పేరుతో ఈ లగ్జరీ ఎస్‌యూవీ కారును  మార్కెట్లో ప్రవేశపెట్టినట్టు కంపెనీ సోమవారం వెల్లడించింది.  దీని  ప్రారంభ ధర రూ. 67.76 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా  కంపెనీ నిర్ణయించింది.   ఈ మేరకు ఆటోమోటివ్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ARAI)  ఆమోదం లభించినట్టు తెలిపింది.     



253 బిహెచ్‌పి పవర్, 370ఎన్‌ఎం గరిష్ట్‌ టార్క్‌,  6.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం,  క్వాట్రో పెర్మనెంట్‌  ఆల్-వీల్ డ్రైవ్, ఆడి డిస్క్ సెలెక్షన్‌ ఫీచర్లతోపాటు వర్చువల్‌ కాక్‌పిట్‌, స్మార్ట్‌ ఆడి స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్‌ష్‌స్‌ తో వస్తున్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో   తొలి ఆడిగా నిలవనుంది.   ఈ కారు ఇప్పటికే 3.0 టిడిఐ ఇంజిన్‌తో భారతదేశంలో అందుబాటులో ఉంది. తాజాగా  కొత్త పెట్రోల్  వెర్షన్‌లో పెద్దగా మార్పులు లేవు.  ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, షిఫ్ట్ పాడెల్స్‌ సహా  హైఎండ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం, ఫోర్‌ జోన్‌ ఆటోమేటిక్‌ క్లైమాట్‌ కంట్రోల్‌,  క్రూయిజ్‌కంట్రోల​, ఆటో పార్క​ అసిస్ట్‌, 8 ఎయిర్‌ బాగ్స్‌ తదితర ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.అంతేకాదు   ఫుల్లీ లోడెడ్‌ టెక్నాలజీ ఎడిషన్‌తో క్యూ 7 ప్రీమియం ప్లస్‌ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉందని  ఆడి వెల్లడించింది.



 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top