వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రో ధరలు

Petrol Diesel prices rise for 3rd consecutive day - Sakshi

సాక్షి, ముంబై: పెట్రో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గతరెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోలు, డీజిలు ధరలు మూడు రోజు (శనివారం) కూడా పైకే చూస్తున్నాయి.  లీటరు పెట్రోల్‌పై19 పైసలు, లీటర్ డీజిల్‌ ధర 29పైసలు చొప్పున పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు 2శాతం తగ్గుముఖం పట్టినా, దేశీయంగా ధరలు పెరుగుతూండటం గమనార్హం. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ.69.26కు చేరగా,  డీజిల్ ధర రూ. 63.10వద్ద ఉంది.  

ముంబై :  లీటర్ పెట్రోల్ ధర రూ. 75 డీజిల్ రూ.66
కోల్‌కతా : పెట్రోల్ ధర లీటరు ధర రూ. 71.39, డీజిల్ రూ .64.87
చెన్నై: లీటరు పెట్రోలు ధర రూ. 71.87 , ఉండగా డీజిల్‌ ధర రూ. 66.62గా ఉంది. 
హైదరాబాద్‌:  లీటర్ పెట్రోల్ ధర రూ. 73.41గా పలుకుతుండగా... డీజిల్ ధర రూ. 68.57గా ఉంది. 
విజయవాడ : లీటరు పెట్రోలు ధర రూ. 72.95 , ఉండగా డీజిల్‌ ధర రూ. 67.76గా ఉంది. 

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top