ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ‘ఎమోజీ’ పిన్ కోడ్‌లు | Online banking MG PIN codes | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ‘ఎమోజీ’ పిన్ కోడ్‌లు

Jun 16 2015 1:01 AM | Updated on Sep 3 2017 3:47 AM

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ‘ఎమోజీ’ పిన్ కోడ్‌లు

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో ‘ఎమోజీ’ పిన్ కోడ్‌లు

ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో నాలుగు అంకెల పిన్ కోడ్ స్థానంలో ‘ఎమోజీ’లను ఆవిష్కరించింది లండన్‌కి చెందిన బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇంటెలిజెంట్ ఎన్విరాన్‌మెంట్స్...

లండన్: ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో నాలుగు అంకెల పిన్ కోడ్ స్థానంలో ‘ఎమోజీ’లను ఆవిష్కరించింది లండన్‌కి చెందిన బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ఇంటెలిజెంట్ ఎన్విరాన్‌మెంట్స్. పాతబడిన నంబర్ల పద్ధతికి బదులుగా సరదాగా ఉండే ఎమోజీలను పాస్ కోడ్‌లుగా  వాడటమనేది 15-25 ఏళ్ల యూజర్లకు ఆకర్షణీయంగా ఉంటుందని సంస్థ ఎండీ డేవిడ్ వెబర్ చెప్పారు. 0-10 దాకానే ఉండే అంకెలతో పోలిస్తే 44 ఎమోజీల కాంబినేషన్లు మరింత సురక్షితంగా ఉంటాయని  వివరించారు. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమాచార మార్పిడి కోసం... వివిధ రకాల హావభావాలతో కూడిన చిత్రాలను ఎమోజీలుగా వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement