
చాలా మందికి కారును సొంతం చేసుకోవడం అంతిమ కల. కానీ జాన్ అలుకాస్‌కు అలా కాదు.. బెస్ట్ కార్ తన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. కేరళకు చెందిన బిలియనీర్, ప్రఖ్యాత జ్యువెలరీ రిటైల్ గ్రూప్ జోస్ అలుక్కాస్ సీఈవో తన లగ్జరీ కార్ల కలెక్షన్‌లో భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ రోడ్ స్టర్ ఎంజీ సైబర్‌స్టర్‌ను జోడించారు.
అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్
ఎంజీ సైబర్‌స్టర్ ఒక సాధారణ స్పోర్ట్స్ కారు కాదు. ఇది క్లాసిక్ డిజైన్ , మోడరన్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీల అద్భుతమైన కలయిక. ఇది అలుక్కాస్ వంటి ఆటోమొబైల్ ఔత్సాహికులకు సరిగ్గా సరిపోతుంది.
ఈ కారు 510 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ తో ప్యాక్ అయింది. సైబర్‌స్టర్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ రోడ్ స్టర్లలో ఒకటిగా నిలిచింది.
బటర్‌ఫ్లై డోర్లు, సొగసైన కన్వర్టిబుల్ రూఫ్, 20-అంగుళాల చక్రాలతో దీని ఫ్యూచరిస్టిక్ లుక్ అబ్బురపరుస్తుంది. 77 కిలోవాట్ల బ్యాటరీతో ఈ కార్ 580 కిలోమీటర్ల రేంజ్ను (వాస్తవ ప్రపంచ పరిస్థితులలో సుమారు 400 కిమీ) ఇస్తుంది. దీని ధరలు రూ.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. సైబర్ స్టర్ ఇప్పటికే ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తరంగాలను సృష్టిస్తోంది.
ఆటోమొబైల్స్ పట్ల జాన్ అలుకాస్కు ఉండే ఇష్టం రహస్యమేమీ కాదు. లగ్జరీ కార్లలో అసాధారణమైన అభిరుచికి ఆయన చాలా కాలంగా ప్రసిద్ది చెందారు. ఆయన ఆకట్టుకునే కార్ల కలెక్షన్లో ఇప్పటికే లంబోర్ఘిని హురాకాన్, రోజువారీ డ్రైవ్ ల కోసం పోర్స్చే 911, మహీంద్రా థార్ 3-డోర్, మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఉన్నాయి. ఇప్పుడు ఎంజీ సైబర్ స్టర్ చేరింది.