ఎయిర్‌టెల్ నుంచి వన్ టచ్ ఇంటర్నెట్ | one touch internet from airtel | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ నుంచి వన్ టచ్ ఇంటర్నెట్

Nov 7 2014 12:45 AM | Updated on Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్, ట్విట్టర్, అమెజాన్ ఇలా ఏది కావాలన్నా వేర్వేరుగా సైట్లను ఓపెన్ చేయాలి.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫేస్‌బుక్, ట్విట్టర్, అమెజాన్ ఇలా ఏది కావాలన్నా వేర్వేరుగా సైట్లను ఓపెన్ చేయాలి. అలా కాకుండా ఒకే స్క్రీన్‌పై వేలాది యాప్స్‌తో టెలికం రంగంలో భారత్‌లో తొలిసారిగా వన్ టచ్ ఇంటర్నెట్ సేవలను ఎయిర్‌టెల్ ప్రారంభించింది. వార్తలు, వీడియోలు, సినిమా, గేమ్స్, షాపింగ్ వంటి యాప్స్ ఒకే స్క్రీన్‌పై దర్శనమిస్తాయి.

ఇంటర్నెట్‌ను తొలిసారిగా వాడే వారి కోసం ఈ సేవలను పరిచయం చేశామని ఎయిర్‌టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్‌రాఘవన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం తెలుగుతోసహా 10 భాషల ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి రోజు 5 ట్రయల్ ప్యాక్స్‌ను కస్టమర్లు ఉచితంగా వాడొచ్చు.

ఆ తర్వాత కస్టమర్ ఎంచుకున్న డాటా ప్యాక్‌నుబట్టి చార్జీలు ఉంటాయి. బ్యాలెన్స్, డాటా వినియోగం, ట్రయల్ ప్యాక్ స్థితిని ‘మై అకౌంట్’ ద్వారా తెలుసుకోవచ్చు. కస్టమర్ తన మొబైల్ నుంచి 111 నంబరుకు డయల్ చేస్తే చాలు లింక్‌తో కూడిన సందేశం వస్తుంది. లింక్‌పై క్లిక్ చేయగానే వన్ టచ్ ఇంటర్నెట్ స్క్రీన్ తెరుచుకుంటుంది. లేదా వన్.ఎయిర్‌టెల్.ఇన్ సైట్‌ను ఓపెన్ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement