టెలికాంలో 6000 ఉద్యోగాలు గోవింద | One tenth of telecom tower workforce may lose jobs, marketing & corporate offices most vulnerable | Sakshi
Sakshi News home page

టెలికాంలో 6000 ఉద్యోగాలు గోవింద

Apr 18 2017 12:09 PM | Updated on Sep 22 2018 8:07 PM

టెలికాంలో 6000 ఉద్యోగాలు గోవింద - Sakshi

టెలికాంలో 6000 ఉద్యోగాలు గోవింద

టెలికాం టవర్ సంస్థల ఉద్యోగాల్లో ప్రతిష్టంభన నెలకొంది.

ముంబై : టెలికాం టవర్ సంస్థల ఉద్యోగాల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఇన్ఫ్రాక్ట్ర్చర్ సంస్థల్లో రెవెన్యూల దెబ్బ, టెలికాం సర్వీసు ప్రొవైడర్ల నుంచి అద్దెలు రాకపోవడం టవర్ సంస్థల్లో ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. దాదాపు 6000 ఉద్యోగాలకు గండి కొట్టనున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో టెలికాం టవర్ కంపెనీల్లో పనిచేసే 10 శాతం మందికి ఉద్యోగాలు పోతాయని రిక్రూట్మెంట్ హెడ్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్లు పేర్కొన్నారు. ప్రస్తుతం టెలికాం టవర్ సంస్థలు 60వేల మంది ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి.
 
వీరిలో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. టెలికాం ఇండస్ట్రీతో సంబంధమున్న సేల్స్, మార్కెటింగ్, కార్పొరేట్ ఆఫీసు ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ లు తెలిపారు. కొత్త వ్యక్తుల నియామకాలు కూడా 50 శాతం మేర తగ్గినట్టు తెలిసింది. అయితే స్వల్పకాలంగా టెలికాం టవర్ ఇండస్ట్రి ఒత్తిడిలో కొనసాగినా.. దీర్ఘకాలంలో ఇది మరింత స్ట్రాంగ్ అవుతుందని  ఎగ్జిక్యూటివ్ లు పేర్కొంటున్నారు. కంపెనీల విలీనం ప్రస్తుతం ఇండస్ట్రీ ఉద్యోగులను ఆందోళనలో పడేస్తుందని తెలుపుతున్నారు.   
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement