ఓలా నుంచి ఫుడ్‌పాండా ఔట్‌: ఉద్యోగాలు ఫట్‌ | Ola pulls plug on Foodpanda food delivery business lays off employees: Report | Sakshi
Sakshi News home page

ఓలా నుంచి ఫుడ్‌పాండా ఔట్‌: ఉద్యోగాలు ఫట్‌

May 24 2019 12:11 PM | Updated on May 24 2019 12:17 PM

Ola pulls plug on Foodpanda food delivery business lays off employees: Report - Sakshi

సాక్షి, ముంబై : క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌  ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన  ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించి  షాక్‌ ఇచ్చింది.  ఓలా ఇటీవల ఫుడ్‌ పాండా  వ్యాపారం క్షీణించడంతో ఫుడ్‌ పాండా పుడ్‌ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. ప్రధానంగా స్విగ్గీ, జొమాటో లాంటి వాటికోసం తమ డబ్బును వృధా చేసుకోవాలని భావించడం లేదని మింట్‌ నివేదించింది. ఇన్‌హౌస్‌ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని  నిర్ణయించింది.  అంతేకాదు అనేకమంది ఉద్యోగులను  కూడా  తొలగించనుంది. సుమారు 40మంది ఎంట్రీ-మిడ్ స్థాయి సిబ్బందిని తొలగించనుంది. 1,500 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్‌  కాంట్రాక్టులను రద్దు చేసింది. 

అయితే  ఫుడ్‌ పాండా ప్రైవేటు లేబుల్స్ క్రింద  తన బిజినెస్‌ను యథావిధిగా కొనసాగిస్తుంది. గత ఏడాది  స్విగ్గీ, జొమాటో, ఉబెర్‌ ఈట్స్‌ పోటీపడేందుకు ఫుడ్‌పాండా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.  స్విగ్గీ, జొమాటోలకు రోజుకు 2 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివరీ  చేస్తుండగా,  ఫుడ్‌ పాండా  రోజు 5వేల ఆర్డర్లను సాధిస్తోందట.  కాగా  2017లో  సుమారు 200 కోట్ల రూపాయలతో (30-40 మిలియన్ డాలర్లు) కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఆహార పంపిణీ సంస్థలో ఓలా కూడా 200 మిలియన్ల డార్లు (సుమారు రూ.1300 కోట్లు) పెట్టుబడులు పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement