పేదవాళ్ల ఇళ్లలో వెలుగులు నింపేందుకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్‌ని రద్దు చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ గివ్ ఇట్ అప్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వీటిపై కూడా 'గివ్ ఇట్ అప్' ఛాలెంజ్
Jul 6 2017 1:03 PM | Updated on Sep 5 2017 3:22 PM
పేదవాళ్ల ఇళ్లలో వెలుగులు నింపేందుకు సబ్సిడీ గ్యాస్ కనెక్షన్‌ని రద్దు చేసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ గివ్ ఇట్ అప్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి దేశవ్యాప్తంగా కూడా అనూహ్య స్పందన వచ్చింది. మొదట్లో స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకున్నవారు ఆశాజనకంగా లేనప్పటికీ, తర్వాత మెల్లమెల్లగా కదలిక వచ్చి చాలా మంది సబ్సిడీలను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ''గివ్ ఇట్ అప్'' ప్లాన్‌ను రైల్వే టిక్కెట్ల రాయితీకి కూడా అమలుచేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ప్రయాణికులు స్వచ్ఛందంగా తమ టిక్కెట్లపై రాయితీలను వదులుకునేందుకు ఓ ఆప్షన్ కూడా తీసుకొస్తోంది. వచ్చే నెలలో రైల్వే దీన్ని లాంచ్ చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ ప్లాన్‌ను లాంచ్ చేసిన అనంతరం రైల్వే రెండు శ్లాబుల్లో రాయితీలను వదులుకునే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందట. ఒకటి 50 శాతం రాయితీ వదులుకోవడం, లేదా 100 శాతం రాయితీని రద్దు చేసుకోవడమని సంబంధిత వర్గాలు చెప్పాయి.
ప్రయాణికులకు సబ్సిడీ ధరల్లో టిక్కెట్లను అందించడంలో ప్రతేడాది రూ.30వేల కోట్ల నష్టాన్ని రైల్వే భరిస్తున్నప్పటికీ ప్రస్తుతం 43 శాతం వ్యయాలను ఇదే భరిస్తోంది. ప్రయాణికుల సెగ్మెంట్లో ఎక్కువ మొత్తంలో రాయితీల భారాన్ని ఇది భరించాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు లేదా కౌంటర్ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసేటప్పుడు ఈ 'గివ్ ఇట్ అప్' ఆప్షన్ అందుబాటులో ఉంటుందని తెలిసింది. సీనియర్ సిటిజన్, దివ్యాంగులు, మీడియా, రైల్వే ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు... ఇలా ఎంతో మంది నిత్యమూ రైళ్లలో రాయితీలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. రాయితీలు పొందిన టికెట్ పై ఏ మేరకు రాయితీ పొందారన్న విషయం కూడా ముద్రితమవుతుందన్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement


