నోకియా 5 సరికొత్త ర్యామ్‌ వేరియంట్‌

Nokia 5 3GB RAM Variant Launched in India - Sakshi

నోకియా 5లో 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ సోమవారం లాంచ్‌ చేసింది. దీని ధర రూ.13,499గా కంపెనీ పేర్కొంది. నవంబర్‌ 7 నుంచి ఈ కొత్త 3జీ వేరియంట్‌ నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి వస్తోంది. అనంతరం ఇది నవంబర్‌ 14 నుంచి ఆఫ్‌లైన్‌గా కూడా అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను జియో-నోకియా అదనపు డేటా ఆఫర్‌గా ఫ్లిప్‌కార్ట్‌ తన ప్లాట్‌ఫామ్‌లో లిస్టు చేసింది. ఈ భాగస్వామ్యంలో జియో ప్రతి రూ.309 రీఛార్జ్‌ లేదా ఆపై మొత్తాలపై అదనంగా 5జీబీ డేటాను 2018 ఆగస్టు 31 వరకు అందించనుంది. మాట్ బ్లాక్, టెంపెడ్ బ్లూ రంగుల్లో ఈ వేరియంట్‌ లభ్యం కానుందని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. తొలుత ఏడాది జూన్‌లో నోకియా 5ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ లాంచ్‌ చేసింది. ఈ సమయంలో కేవలం 2జీబీ వేరియంట్‌నే మార్కెట్‌లలోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం నోకియా 5 3జీబీ వేరియంట్‌  కూడా అందుబాటులోకి వచ్చేసింది.

నోకియా 5 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ఫీచర్లు...
​ర్యామ్‌ మినహాయిస్తే మిగిలిన ఫీచర్లన్నీ 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌కు, 2జీబీ ర్యామ్‌ మోడల్‌కు ఒకే మాదిరిగా ఉండనున్నాయి
డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్‌ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌, 16జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top