నిస్సాన్‌ కార్లపై భారీ ఆఫర్లు

Nissan offers in September 2019: Benefits of up to Rs 90000 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమ్మకాలు పడిపోవడంతో ఆటో కంపెనీలు వరుసగా తమ వాహనాల కొనుగోలుపై పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా నిస్సాన్‌ మోటార్స్‌ ఇండియా తన పాపులర్‌ కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌  కూడా ఉంది. నిస్సాన్ సన్నీ మోడల్‌ కారు కొనుగోలుపై గరిష్టంగా 90,000 రూపాయల వరకు ఆఫర్‌ ఉంది. నిస్సాన్ మైక్రా, మైక్రో యాక్టివా, సన్నీలపై వివిధ రకాల క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ లభ్యం. అయితే నిస్సాన్‌ కిక్స్‌ కొనుగోలుపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ లేదు. నిస్సాన్ కస్టమర్లకు ఫైనాన్స్ సులభతరం చేయడానికి కిక్స్‌లో జీరో శాతం వడ్డీ ఎంపిక అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 30, 2019 వరకు ఈ  తగ్గింపు ఆఫర్‌ చెల్లుబాటవుతుంది. ఈ ఆఫర్‌లు  ఆయా నగరం, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉంది. ఖచ్చితమైన వివరాల కోసం నిస్సాన్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి.

నిస్సాన్ సన్నీ: నిస్సాన్ సన్నీపై రూ .30,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. దీంతోపాటు కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు,  వైద్యులకు 14,000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్లను కూడా ఇది అందిస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సీఏలకు, వాస్తుశిల్పులకు 8,000 రూపాయల వరకు ప్రత్యేక తగ్గింపు ఉంది.

నిస్సాన్ మైక్రో: మైక్రో హ్యాచ్‌బ్యాక్  కొనుగోలుపై రూ .25 వేల వరకు నగదు తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ .20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌.  కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు రూ .10వేల వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సిఏలు,  వాస్తుశిల్పులకు రూ .5 వేల వరకు తగ్గింపు వర్తిస్తుంది.

నిస్సాన్‌ మైక్రో యాక్టివా: మైక్రో యాక్టివా కోసం, నిస్సాన్ రూ .15 వేల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌.  బ్యాంక్ ,  కార్పొరేట్ ఉద్యోగులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సిఏలు, వాస్తుశిల్పులకు ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. 

నిస్సాన్‌ కిక్స్‌ :  పెట్రోల్‌ వెర్షన్‌ కోసం 7.99 శాతం వడ్డీరేటు, అయిదేళ్ల వారంటీ, రోడ్‌సైట్‌ అసిస్టెన్స్‌ , రూ. 17వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లున్నాయి. అలాగే నిస్సాన్‌ కస్టమర్లకు  మూడేళ్లపాటు జీరో శాతం వడ్డీరేటుతో రుణం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top