breaking news
Nissan Micra
-
నిస్సాన్ కార్లపై భారీ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: అమ్మకాలు పడిపోవడంతో ఆటో కంపెనీలు వరుసగా తమ వాహనాల కొనుగోలుపై పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా నిస్సాన్ మోటార్స్ ఇండియా తన పాపులర్ కార్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. నిస్సాన్ సన్నీ మోడల్ కారు కొనుగోలుపై గరిష్టంగా 90,000 రూపాయల వరకు ఆఫర్ ఉంది. నిస్సాన్ మైక్రా, మైక్రో యాక్టివా, సన్నీలపై వివిధ రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్ లభ్యం. అయితే నిస్సాన్ కిక్స్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్ లేదు. నిస్సాన్ కస్టమర్లకు ఫైనాన్స్ సులభతరం చేయడానికి కిక్స్‌లో జీరో శాతం వడ్డీ ఎంపిక అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 30, 2019 వరకు ఈ తగ్గింపు ఆఫర్ చెల్లుబాటవుతుంది. ఈ ఆఫర్లు ఆయా నగరం, వేరియంట్‌ను బట్టి మారే అవకాశం ఉంది. ఖచ్చితమైన వివరాల కోసం నిస్సాన్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి. నిస్సాన్ సన్నీ: నిస్సాన్ సన్నీపై రూ .30,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. దీంతోపాటు కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు, వైద్యులకు 14,000 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్లను కూడా ఇది అందిస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సీఏలకు, వాస్తుశిల్పులకు 8,000 రూపాయల వరకు ప్రత్యేక తగ్గింపు ఉంది. నిస్సాన్ మైక్రో: మైక్రో హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుపై రూ .25 వేల వరకు నగదు తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ .20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్. కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగులు రూ .10వేల వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, సిఏలు, వాస్తుశిల్పులకు రూ .5 వేల వరకు తగ్గింపు వర్తిస్తుంది. నిస్సాన్ మైక్రో యాక్టివా: మైక్రో యాక్టివా కోసం, నిస్సాన్ రూ .15 వేల వరకు నగదు తగ్గింపుతో పాటు రూ .20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్. బ్యాంక్ , కార్పొరేట్ ఉద్యోగులు, వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సిఏలు, వాస్తుశిల్పులకు ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. నిస్సాన్ కిక్స్ : పెట్రోల్ వెర్షన్ కోసం 7.99 శాతం వడ్డీరేటు, అయిదేళ్ల వారంటీ, రోడ్‌సైట్ అసిస్టెన్స్ , రూ. 17వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లున్నాయి. అలాగే నిస్సాన్ కస్టమర్లకు మూడేళ్లపాటు జీరో శాతం వడ్డీరేటుతో రుణం. -
సమంతకు ప్రధాని సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్
లండన్: బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. అది కూడా తన భార్య సమంతకు గిఫ్ట్‌గా ఇవ్వడం కోసం. ఆయన చూసి చూడగానే ఆ కారుపై మనసుపడి తన భార్యకు గిఫ్ట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన దాదాపు 1,495 ఫౌండ్లు వెచ్చించి ఈ కారును తీసుకున్నారు. తన నియోజకవర్గం మినిస్టర్ లోవెల్‌లో గల ఓ సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణానికి వెళ్లిన కామెరూన్ 2004 నిస్సాన్ మైక్రా బ్లూకారును కొనేశారు. ఈ కారు అమ్మిన యజమాని లేయిన్ హ్యారీస్ ఈ విషయంపై వివరణ ఇస్తూ 'శుక్రవారం రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది. ప్రధాని కామెరాన్ తన కార్లు షెడ్లలో ఓ కారును చూసేందుకు వస్తున్నారని. కానీ, నా సహచరుల్లో ఎవరో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. కానీ, ఆయన నిజంగానే నా వద్దకు వచ్చేసరికి నమ్మలేకపోయాను. కనీసం అరగంటపాటు కారును చూస్తూ ఇక్కడే గడిపారు. ఇలాంటి కార్లు బ్రిటన్ లో తయారుచేస్తే బాగుంటుందని అన్నారు. ఆయన చాలా సాన్నిహిత్యంతో ఉండే వ్యక్తి. వేరే వారు కార్లు కొనేందుకు వచ్చినప్పుడు ఎలా ఉంటారో ఆయన కూడా అలాగే ఉన్నారు. కారు ఇన్సూరెన్స్ వివరాలు.. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్న విషయాలు అడిగి తెలుసుకున్నారు' అని చెప్పారు.