ఒక్క డాలర్‌కే ఆస్ట్రేలియా మీడియా సంస్థ అమ్మకం!

New Zealand media firm Stuff to be sold for a single dollar  - Sakshi

‘స్టఫ్‌’కు కరోనా కష్టాలు.. సీఈఓకు ధారాదత్తం

వెల్లింగ్టన్‌: కరోనా మహమ్మారి దెబ్బకు రెవెన్యూ పడిపోయి మీడియా సంస్థలు కుదేలవుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్‌’. ఎన్నో జాతీయ దినపత్రికలను ప్రచురిస్తూ, స్టఫ్‌ పేరుతోనే ఎంతో ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థను.. కేవలం డాలర్‌కే (మన రూపాయిల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్‌ బౌచర్‌కు విక్రయిస్తున్నట్టు మాతృ సంస్థ నైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది. ఈ డీల్‌ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆస్ట్రేలియన్‌ స్టాక్‌ మార్కెట్‌కు తెలియజేసింది. స్టఫ్‌లో 400 జర్నలిస్టులు సహా 900 మంది పనిచేస్తున్నారు. ప్రకటనల ఆదాయం పడిపోవడంతో స్టఫ్‌ ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ డీల్‌ చోటు చేసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top