రేట్ల పెంపు కొనసాగుతుంది: అమెరికా

New Fed chair Jerome Powell sees little risk of a recession - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగానే ఉందని ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జీరోమ్‌ పావెల్‌ స్పష్టం చేశారు. స్టాక్‌ మార్కెట్లలో ఆటుపోట్ల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండబోదన్నారు. వృద్ధి, ఉపాధికి సంబం ధించిన మెరుగైన అంచనాల బలంతో ఫెడ్‌ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని తెలియజేశారు.

ఫెడ్‌ గతేడాది మూడు పర్యాయాలు రేట్లను పెంచడమే కాకుండా 2018లోనూ మూడు సార్లు పెంచుతామని సంకేతమిచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. జానెట్‌ యెలెన్‌ తర్వాత అమెరికా ఫెడ్‌ చైర్మన్‌గా ఈ నెల 5న బాధ్యతలు చేపట్టిన పావెల్‌ కూడా రేట్ల పెంపుపట్ల స్పష్టతతో ఉన్న ట్టు తాజా వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.ఈ నెల మొదట్లో స్టాక్‌ మార్కెట్లలో భారీ కరెక్షన్‌లను ప్రస్తావిస్తూ ఈ పరిణామాలు ఆర్థిక రంగ భవిష్యత్తుపై, లేబర్‌ మార్కెట్, ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం చూపిస్తాయని ఫెడ్‌ భావించడం లేదన్నారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top