రుణభారం తగ్గించుకోడానికి కసరత్తు: కంట్రీక్లబ్‌ | Natural gas leak near Farmington Country Club entrance | Sakshi
Sakshi News home page

రుణభారం తగ్గించుకోడానికి కసరత్తు: కంట్రీక్లబ్‌

Nov 16 2018 1:19 AM | Updated on Nov 16 2018 1:19 AM

Natural gas leak near Farmington Country Club entrance - Sakshi

ముంబై: రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే క్రమంలో నిధుల సమీకరణకు కంట్రీ క్లబ్‌ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట్, కర్ణాటకలోని సర్జాపూర్‌ ప్రాపర్టీలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంట్రీ క్లబ్‌ హాస్పిటాలిటీ అండ్‌ హాలిడేస్‌ (సీసీహెచ్‌హెచ్‌ఎల్‌) చైర్మన్‌ వై.రాజీవ్‌ రెడ్డి వెల్లడించారు.

వీటిని అభివృద్ధి చేయడంతో 5 లక్షల చదరపుటడుగుల డెవలప్‌మెంట్‌ ఏరియా అందుబాటులోకి వస్తుందని, కంపెనీకి రూ.140 కోట్ల దాకా లభించగలవని ఆయన చెప్పారు.ప్రస్తుతం దేశీయంగా తమ రుణభారం రూ. 275 కోట్లని, రూ.1,500 కోట్ల మేర ఆస్తులున్నాయని చెప్పారాయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement