
వినియోగదారుల వ్యయానికి మోడీ జోష్
నరేంద్ర మోడీ మార్కెట్లకే కాదు, వినియోగదారులకు కూడా ఊపునిస్తున్నారు. స్థిరమైన ప్రభుత్వం సుస్థిరమైన, సంస్కరణలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవచ్చని వినియోగదారులు భావిస్తున్నారని ప్రముఖ ఆర్థిక అంశాల రీసెర్చ్ సంస్థ జైఫిన్ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది.
ముంబై: నరేంద్ర మోడీ మార్కెట్లకే కాదు, వినియోగదారులకు కూడా ఊపునిస్తున్నారు. స్థిరమైన ప్రభుత్వం సుస్థిరమైన, సంస్కరణలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవచ్చని వినియోగదారులు భావిస్తున్నారని ప్రముఖ ఆర్థిక అంశాల రీసెర్చ్ సంస్థ జైఫిన్ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. దీంతో రానున్న నెలల్లో వివిధ వస్తువులపై ఖర్చు చేయడానికి వినియోగదారులు సిద్ధంగా ఉన్నారంటున్న ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు -మెట్రో, టైర్ వన్, టైర్ టూ.. ఈ తరహా 18 నగరాల్లోని 4,000 మంది వినియోగదారులపై ప్రతినెలా ఈ సర్వే నిర్వహిస్తారు.
ఈ సర్వే వివరాలు...
ఏప్రిల్‌లో 40.6 పాయింట్లుగా ఉన్న కన్సూమర్ అవుట్‌లుక్ ఇండెక్స్ మేలో 42 పాయింట్లకు పెరిగింది.
వడ్డీరేట్లు తగ్గుతాయని ఆర్‌బీఐ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో రానున్న మూడు. నాలుగు నెలల్లో వినియోగదారుల వ్యయం పెరుగుతుందని అంచనాలు పెరుగుతున్నాయి. ఫలితంగా వాహన, రియల్టీ రంగాల్లో జోష్ పెరుగుతుంది.
కొత్త కొలువులు రాకపోవడం, ఉన్న ఉద్యోగ పరిస్థితుల్లో మార్పులు లేకపోవడం, దిగిరానంటున్న ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులతో ఇప్పటిదాకా వినియోగదారులు అవస్థలు పడ్డారు. మోడీ రాకతో పరిస్థితులు మారతాయనే భరోసా వినియోగదారుల్లో పెరిగింది.
ఏప్రిల్‌లో 26 గాఉన్న స్పెండింగ్ సెంటిమెంట్ ఇండెక్స్ మేలో 28.1కు పెరిగింది. గత ఏడాది డిసెంబర్ నుంచి చూస్తే ఇది మెరుగుపడడం ఇది మొదటిసారి.