మోటో ఎ‍క్స్‌ 4 కొత్త వేరియంట్‌ | Moto X4 6GB RAM Variant Launched in India: Price, Release Date, Specifications | Sakshi
Sakshi News home page

మోటో ఎ‍క్స్‌ 4 కొత్త వేరియంట్‌

Jan 29 2018 4:14 PM | Updated on Jan 29 2018 4:14 PM

Moto X4 6GB RAM Variant Launched in India: Price, Release Date, Specifications   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  మోటో ఫ్యామిలీలో  మరోకొత్త వేరియంట్‌ సార్ట్‌ఫోన్‌  చేరింది. సోమవారం మోటోరోలా  కొత్త డివైస్‌నులాంచ్‌ చేసింది.  మోటో ఎక్స్‌ 4   6జీబీని మార్కెట్లో విడుదల  చేసింది.  గత మోటో నవంబర్‌లో వచ్చిన ఎక్స్4 స్మార్ట్‌ఫోన్‌కు తాజాగా  6 జీబీ ర్యామ్ వేరియెంట్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.24,999గా నిర్ణయించింది.  జనవరి 31వ తేదీ నుంచి మోటో హబ్స్ , ఫ్లిప్‌కార్ట్లో ప్ర‌త్యేకంగా లభ్యం.  లాంచింగ్‌ ఆఫర్ల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు  ద్వారా  ఈ ఫోన్‌ను కొంటే రూ.1500 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది.  అలాగే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.3వేల వ‌ర‌కు డిస్కౌంట్ వ‌స్తుంది. వొడాఫోన్ నుంచి  డేటా ఆఫర్ కూడా లభిస్తుంది. రూ. 199 ప్లాన్‌పై   490 జీబీ  డేటాను  అలభిస్తుంది. అలాగే నో కాస్ట్‌  ఈఎంఐ ఆఫర్‌. ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 2(శుక్రవారం)వరకు మాత్రమే లభ్యం.

మోటో ఎక్స్4 ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌టీపీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే
 గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
6 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్,
2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
12+8  ఎంపీ డ్యుయల్  రియర్‌ కెమెరా
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
3000 ఎంఏహెచ్ బ్యాటరీ,  టర్బో చార్జింగ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement