ఈ మిడ్‌ క్యాప్స్‌ భలే స్పీడ్‌ సుమా!

Mid Small caps jumps with volumes in positive market - Sakshi

జాబితాలో జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌..

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, పాలీకేబ్‌ ఇండియా

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, కింగ్‌ఫా సైన్స్‌, రాణే హోల్డింగ్స్‌

విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి మరింత జోరందుకున్నాయి. భారీ లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 480 పాయింట్లు జంప్‌చేసి 35,894కు చేరగా.. నిఫ్టీ 138 పాయింట్లు ఎగసి 10,567 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా ఎగసింది. జాబితాలో జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, పాలీకేబ్‌ ఇండియా
ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, కింగ్‌ఫా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, రాణే హోల్డింగ్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఎన్‌ఎస్‌ఈలో ఈ ఎన్‌బీఎఫ్‌సీ షేరు ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 101 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 103 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 1.19 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 7.4 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌
స్టీల్‌ పైపుల తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 1778 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1792 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 2000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 4,000 షేర్లు చేతులు మారాయి.

పాలీక్యాబ్‌ ఇండియా
ఎలక్ట్రికల్‌ కేబుల్స్‌, అప్లయెన్సెస్‌ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 861 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1790 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 28,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 46,000 షేర్లు చేతులు మారాయి.

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ 
హెల్త్‌కేర్‌ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 6 శాతం పుంజుకుని రూ. 130 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 132 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 3.95 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 2.71 లక్షల షేర్లు చేతులు మారాయి.

కింగ్‌ఫా సైన్స్‌
పాలీప్రొఫిలీన్‌ కాంపౌండ్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 12 శాతం పురోగమించి రూ. 393 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 422 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 1400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3000 షేర్లు చేతులు మారాయి.

రాణే హోల్డింగ్స్‌
ఆటో విడిభాగాల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 473 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 490 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్‌ పరిమాణం 3000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1500 షేర్లు మాత్రమే చేతులు మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top