ఈ చిన్న షేర్లు మార్కెట్లకంటే స్పీడ్‌

Mid Small caps jumps with volumes in positive market - Sakshi

భారీ లాభాలతో దూకుడు

ట్రేడింగ్‌ పరిమాణం సైతం

జాబితాలో మహీంద్రా హాలిడేస్‌

ఇండో నేషనల్‌, ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌

నితిన్‌ స్పిన్నర్స్‌, నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌

ఉన్నట్టుండి మెరుగుపడిన సెంటిమెంటు ప్రభావంతో వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్‌ 340 పాయింట్లు(1 శాతం) పెరిగి 35,251కు చేరగా.. నిఫ్టీ 109 పాయింట్లు(1 శాతం) ఎగసి 10,421 వద్ద ట్రేడవుతోంది. అయితే కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో మార్కెట్లకు మించిన వేగంతో ఈ షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా జంప్‌చేయడం గమనార్హం. జాబితాలో మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌, లైఫ్‌, నిప్పన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ఇండో నేషనల్‌, నితిన్‌ స్పిన్నర్స్‌, ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం..

మహీంద్రా హాలిడేస్‌ రిసార్ట్స్‌
ఆతిధ్య రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 179 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 18 శాతం దూసుకెళ్లి రూ. 199ను అధిగమించింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 3750 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7400 షేర్లు చేతులు మారాయి.

నిప్పన్‌ లైఫ్‌ ఇండియా ఏఎంసీ
ప్రయివేట్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 313 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 322 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 93500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.57 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఇండో నేషనల్‌ 
నిప్పో బ్రాండ్‌ బ్యాటరీల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 633 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 450 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4000 షేర్లు చేతులు మారాయి.

నితిన్‌ స్పిన్నర్స్‌
కాటన్‌ యార్న్‌ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో  20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 53 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 11,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.54 లక్షల షేర్లు చేతులు మారాయి.

ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌
నావల్టీ ఫ్యాబ్రిక్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 16 శాతం జంప్‌చేసి రూ. 73 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 75 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 1300 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,000 షేర్లు చేతులు మారాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top