ఈ మిడ్‌ క్యాప్స్‌ జోరు చూడతరమా

Mid cap stocks gain with volumes - Sakshi

భారీ లాభాలతో గెలాప్‌

ట్రేడింగ్‌ పరిమాణం సైతం

మార్కెట్లను మించిన జోరు

సెన్సెక్స్‌ 525 పాయింట్లు అప్‌

విదేశీ సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 525 పాయింట్లు జంప్‌చేసి 34,812కు చేరగా.. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 10,296 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లు భారీ లాభాలతో మార్కెట్లను మించి కదం తొక్కుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో డిష్‌మన్‌ కార్బొజెన్‌, చెన్నై పెట్రోలియం, స్టార్‌ సిమెంట్‌, జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. 

డిష్‌మన్‌ కార్బొజెన్‌
హెల్త్‌కేర్‌ రంగ డిష్‌మన్‌ కార్బొజెన్‌ కౌంటర్లో అమ్మకందారులు కరువుకాగా.. కొనేవాళ్లు అధికమయ్యారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 14 పెరిగి రూ. 86 వద్ద నిలిచింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 31,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.51 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి.

చెన్నై పెట్రోలియం 
ముడిచమురు శుద్ధి చేసే ఇంధన రంగ కంపెనీ చెన్నై పెట్రోలియం షేరు ఎన్‌ఎస్‌ఈలో 14 శాతం పురోగమించింది. రూ. 72 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 73 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 89,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.08 లక్షలకుపైగా షేర్లు చేతులు మారాయి. 

స్టార్‌ సిమెంట్‌
ప్రయివేట్‌ రంగ కంపెనీ స్టార్‌ సిమెంట్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 14 శాతం జంప్‌చేసింది. రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 93 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 55,000 షేర్లు చేతులు మారాయి.

జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌
డైవర్సిఫైడ్‌, టైర్ల తయారీ కంపెనీ జేకే టైర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12 శాతం జంప్‌చేసింది. రూ. 65 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 66 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 63,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2.7 లక్షల షేర్లు చేతులు మారాయి. 

శ్రీరామ్‌ సిటీ యూనియన్‌
ఎన్‌బీఎఫ్‌సీ.. శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12 శాతం దూసుకెళ్లింది. రూ. 712 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 738 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం కేవలం 1,400 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 9,500 షేర్లు చేతులు మారాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top