2017లో సత్య నాదెళ్ల తొలి పుస్తకం.. ‘హిట్ రిఫ్రెష్’ | Microsoft CEO Satya Nadella is writing a book called Hit Refresh | Sakshi
Sakshi News home page

2017లో సత్య నాదెళ్ల తొలి పుస్తకం.. ‘హిట్ రిఫ్రెష్’

Jul 1 2016 12:56 AM | Updated on Sep 4 2017 3:49 AM

2017లో సత్య నాదెళ్ల తొలి పుస్తకం.. ‘హిట్ రిఫ్రెష్’

2017లో సత్య నాదెళ్ల తొలి పుస్తకం.. ‘హిట్ రిఫ్రెష్’

టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ సీఈవో ‘సత్య నాదెళ్ల’ రచించిన తొలి పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది.

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’ సీఈవో ‘సత్య నాదెళ్ల’ రచించిన తొలి పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’ వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది. ఈ పుస్తకంప్రింటింగ్ రైట్స్‌ను ‘హార్పర్ బిజినెస్’ సొంతం చేసుకుంది. అంటే ఈ సంస్థ నాదెళ్ల పుస్తకాన్ని ఆంగ్లంలో ప్రింట్ చేసి అంతర్జాతీయంగా విక్రయిస్తుంది. హిట్ రిఫ్రెష్ పుస్తకం.. మార్పునకు సంబంధించిందని సత్య నాదెళ్ల తెలిపారు. ఎలా విజయవంతమవ్వాలి? చరిత్ర.. జ్ఞాపకాలు వంటి అంశాలకు సంబంధించినది కాదని చెప్పారు. పుస్తకంలో ప్రధానంగా తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరివర్తన, మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే మూడింటి ప్రస్తావన ఉంటుందని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement