
మైక్రోమ్యాక్స్ ‘యు’ బ్రాండ్... యుఫోరియా @ 6,999
మైక్రోమ్యాక్స్ కంపెనీ ‘యు’ బ్రాండ్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ యుఫోరియాను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది.
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ ‘యు’ బ్రాండ్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ యుఫోరియాను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. యుఫోరియా ఫోన్ ధర రూ.6,999 అని, అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొం ది. మంగళవారం నుంచే ఈ ఫోన్ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని, ఈ నెల 28 నుంచి విక్రయాలు జరుపుతామని పేర్కొంది. భారత్‌లోనే రూపొందించి, తయారు చేసిన తమ తొలి స్మార్ట్‌ఫోన్ యుఫోరియా అని వివరించింది.
ఇక మైక్రోమ్యాక్స్‌కు చెందిన యు బ్రాండ్ కనెక్టెడ్ డివెసైస్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. హెల్త్‌యు, యుఫిట్ డివైస్‌లను అందిస్తోంది. వినియోగదారుల అహార రికార్డులను ట్రాక్ చేసి, వారు ఫిట్‌నెస్‌తో ఉండేలా యు ఫిట్ డివైస్ తోడ్పడుతుందని యు బ్రాండ్ పేర్కొంది. ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆధారిత సైనోజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్‌లో 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమెరీ, 2,230 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.