మారుతి సుజుకి సెప్టెంబర్ సర్‌ప్రైజ్ | Maruti Suzuki September Surprise | Sakshi
Sakshi News home page

మారుతి సుజుకి సెప్టెంబర్ సర్‌ప్రైజ్

Sep 10 2015 12:29 AM | Updated on Sep 3 2017 9:04 AM

మారుతి సుజుకి సెప్టెంబర్ సర్‌ప్రైజ్

మారుతి సుజుకి సెప్టెంబర్ సర్‌ప్రైజ్

వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి సెప్టెంబర్ సర్‌ప్రైజ్‌ను ప్రకటించింది...

హైదరాబాద్: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి సెప్టెంబర్ సర్‌ప్రైజ్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా బుకింగ్ కోసం చెల్లించిన మొత్తంపై 100 శాతం వరకు క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. తద్వారా కస్టమర్లు అదనంగా రూ.20,000 వరకు ఆదా చేయొచ్చని కంపెనీ రీజినల్ మేనేజర్ మునీష్ బాలి తెలిపారు. దీనితోపాటు మరిన్ని ఆకర్షణీయ ఆఫర్లను మారుతి సుజుకి అందిస్తోందని చెప్పారు. కారును సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. సెప్టెంబర్ సర్‌ప్రైజ్ ఈ నెల 17 వరకు జరిగే బుకింగ్స్‌కు వర్తిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement