'బెస్ట్ సెల్లింగ్ కారు' ట్యాగ్ దానికే! | Maruti Suzuki Sells 1.07 Lakh Units of Alto in First 5 Months of 2017 | Sakshi
Sakshi News home page

'బెస్ట్ సెల్లింగ్ కారు' ట్యాగ్ దానికే!

Jun 28 2017 1:18 PM | Updated on Sep 5 2017 2:42 PM

ఆల్టో... మారుతీ సుజుకీ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్. ఈ కారు విక్రయాలు 2017 తొలి ఐదు నెలల కాలంలోనే 1.07 లక్షల యూనిట్లకు పైగా నమోదయ్యాయి.



ఆల్టో... మారుతీ సుజుకీ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్. ఈ కారు విక్రయాలు 2017 తొలి ఐదు నెలల కాలంలోనే 1.07 లక్షల యూనిట్లకు పైగా నమోదయ్యాయి. దీంతో భారత్ లో తమ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఆల్టోనే నిలిచినట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. లాంచ్ అయినప్పటి నుంచి ఆల్టోకు వినియోగదారుల నుంచి మంచి మద్దతు పొందుతూ వస్తోంది. మంచి డిజైన్ లో సరసమైన ధర, ప్రదర్శన, ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. 25 శాతం ఆల్టో కొనుగోళ్లు 30 ఏళ్ల కంటే తక్కువ వయసున యువతనే చేపడుతున్నారని కంపెనీ తెలిపింది. దీంతో గత మూడేళ్లలో విక్రయాల్లో దీని సహకారం 4 శాతం పెరిగినట్టు కూడా పేర్కొంది. 
 
తొలిసారి ఆల్టో మోడల్ ను మారుతీ సుజుకీ 2000 సెప్టెంబర్ లో భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. గత 17 ఏళ్ల అనుభవంలో కస్టమర్ల డిమాండ్ కు అనుగుణంగా ఈ కారును పలుసార్లు అప్ గ్రేడ్ చేసింది. ఆల్టో లాంచ్ అయిన తొలి మూడేళ్లలోనే లక్ష క్యుములేటివ్ విక్రయాలను నమోదుచేసింది. 2016-17లో మారుతీ సుజుకీ 21వేలకు పైగా ఆల్టో యూనిట్లను శ్రీలంక, చిల్లి, ఫిలిప్పీన్, ఉరుగ్వే వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసింది. ఎగుమతులకు తోడు దేశీయ అమ్మకాల జోరు కూడా ఈ కారుకు బాగాసహకరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న ఆల్టోలో రెండు ఇంజిన్ ఆప్షన్లున్నాయి. ఆల్టో కే10 మోడల్ క్లచ్ లెస్ ఆటో గేర్ సిఫ్ట్ ట్రాన్సమిషన్ టెక్నాలజీని కూడా ఆఫర్ చేస్తోంది. ఆల్టోను అధిగమించడానికి రెనాల్డ్ క్విడ్ దానికి గట్టి పోటీదారుగా కూడా నిలుస్తూ వస్తోంది. కానీ ఇటీవల అమ్మకాల్లో క్విడ్ మోడల్ , ఆల్టోకు అంత భారీ ఎత్తున్న పోటీ ఇవ్వలేదని తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement