ఐదు స్టార్టప్‌లతో మారుతి జత

Maruti collaborates with five start-ups - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశీయ ఆటోదిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) నూతన ఆవిష్కరణలకోసం కీలక నిర్ణయం  తీసుకుంది.  తన మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్ (మెయిల్) ప్రోగ్రాం కింద ఐదు స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు సోమవారం తెలిపింది.  ప్రధానంగా కృత్రిమ మేధస్సు పై పనిచేస్తున్న సెన్స్ గిజ్, క్సేన్, ఐడెంటిఫై, ఎన్‌మోవిల్, డాకెట్‌రన్ అనే ఐదు స్టార్టప్‌లతో జతకట్టింది. 

ఈ ఒప్పందాల ద్వారా ఆటోమొబైల్ రంగంలో వినూత్న, అత్యాధునిక సొల్యూషన్స్‌తో ముందుకు వస్తున్న స్టార్టప్‌లను గుర్తించి, ఒకచోటకు తీసుకొచ్చినట్టు తెలిపింది. మారుతి సుజుకి వాటాదారుల ప్రయోజనాలను నిలుపుకుంటూ, భారతీయ కస్టమర్ల అవసరాలకు అవసరాల కంటే ముందుగానే అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీ సేవలను అందిచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని  ఎంఎస్‌ఐ ఎండి, సీఈవో కెనిచి ఆయుకావా వెల్లడించారు.  ఈ స్టార్టప్‌లతో భాగస్వామ్యం కావడం ద్వారా  ఆటోమొబైల్  సొల్యూషన్‌ కొత్త యుగంలోకి ప్రవేశించామన్నారు.  స్టార్టప్‌లతో పాటు పనిచేయడం ద్వారా పరిష్కారాల స్కేలబిలిటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇవి  కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. ప్రస్తుతానికి మారుతి సుజుకిలోని డొమైన్ నిపుణుల మార్గనిర్దేశనంపాటు, భవిష్యత్తులో దేశీయ, అంతర్జాతీయ  స్టార్టప్‌  మార్కెట్‌ నిపుణుల ద్వారా మొత్తం ఐదు స్టార్టప్‌లకు మూడు నెలల సుదీర్ఘ  యాక్సలరేషన్‌  కార్యక్రమం ఉంటుందని  చెప్పారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top