
సాక్షి, ముంబై: హోలీ పండుగ సందర్భంగా నేడు (శుక్రవారం) మార్కెట్లకు సెలవు. ఈక్వీటీమార్కెట్లు, బులియన్, కమోడిటీ మార్కెట్లు శుక్రవారం పనిచేయవు. సోమవారం మళ్లీ యథావిధంగా మొదలవుతాయి. మరోవైపు.. లాంగ్ వీకెండ్ కావడంతో( శుక్ర,శని, ఆది మూడురోజులు) ఇన్వెస్టర్ల అప్రమత్తత నేపథ్యంలో గురువారం 137 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 34046.94 వద్ద, 34.50 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ.. 10458.35 ముగిసింది. పాఠకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.