స్టాక్‌మార్కెట్ల కొత్త రికార్డులు | markets opens at record high | Sakshi
Sakshi News home page

స్టాక్‌మార్కెట్ల కొత్త రికార్డులు

Jul 10 2017 9:36 AM | Updated on Sep 5 2017 3:42 PM

స్టాక్‌మార్కెట్ల కొత్త రికార్డులు

స్టాక్‌మార్కెట్ల కొత్త రికార్డులు

దేశీయ స్టాక్‌మార్కెట్లు వారం ఆరంభంలోనే రికార్డ్‌ స్థాయిలను నమోదు చేశాయి.

ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు వారం ఆరంభంలోనే రికార్డ్‌ స్థాయిలను నమోదు చేశాయి. భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లలో   సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ సాధించింది. 234 పాయింట్లు జంప్‌చేసి 31,595ను తాకింది. తద్వారా మార్కెట్‌ చరిత్రలో సెన్సెక్స్‌ మరోసారి కొత్త గరిష్టాన్ని అందుకుంది. అలాగే 9732వద్ద నిఫ్టీ రికార్డ్‌ స్థాయిని నమోదు చేసిన అనంతరం స్వల్పంగా వెనుకంజ వేసింది. అయితే మార్కెట్‌ ప్రారంభంలో ఎన్‌ఎస్‌ఈ రేట్లు అప్‌టేడ్‌ కావడంలో  తలెత్తిన సాంకేతిక సమస్య  కొంత గందరగోళం నెలకొంది. సెన్సెక్స్‌ 195 లాభంతో 31556వద్ద  నిఫ్టీ 22 పాయింట్లు ఎగిసి  9687వద్ద కొనసాగుతోంది.

దాదాపు అన్నిరంగాలూ లాభాల్లోనే కదులుతున్నాయి.   బ్యాంకింగ్‌ నిఫ్టీ,  మెటల్‌, ఆటో సెక్టార్లు  భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకుల ర్యాలీని మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి.  ఐటీ కూడా స్వల్పంగా లాభపడుతోంది.  అలాగే మెగా మెర్జర్‌ను ప్రకటించిన ఐడీఎఫ్‌సీ, శ్రీరామ్‌ షేర్లు బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. లుపిన్‌, టాటా మోటార్స్‌,ఐటీసీ, టాటా స్టీల్‌,  భారతి ఎయిర్‌టెల్‌,  రిలయన్స్‌, టీసీఎస్‌ భారీగా లాభపడుతుండగా  బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement