మాల్యాకు మరో చిక్కు: పనామాతో లింకులు

Mallya's link with Panama Papers emerges amid his extradition case

ముంబై : బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో న​​​క్కిన విజయ్‌ మాల్యాకు చిక్కుల మీద చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆయన అప్పగింత కేసును మరింత బలోపేతం చేస్తూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్‌మాల్యా ప్రమోటెడ్‌ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌,  పనామా పేపర్‌లో ఉన్న లిబేరియన్‌కు చెందిన రెండు కంపెనీలతో  లావాదేవీలు జరిపినట్టు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ రిపోర్టు చేసింది. 2,14,488పైగా ఆఫ్‌సోర్‌ కంపెనీల ఫైనాన్సియల్‌, అటార్ని క్లయింట్‌ సమాచారానికి చెందిన 11.5 మిలియన్‌ లీక్‌డ్‌ డాక్యుమెంట్లే ఈ పనామా పేపర్లు. తాజా విచారణలో భాగంగా ఓ రెండు సంస్థలు, ప్రస్తుతం పనిచేయని దేశీయ క్యారియర్‌లో వాటాలు కలిగి ఉన్నట్టు తెలిసింది. సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసు(సీఎఫ్‌ఐఓ) నిర్వహించిన తాజాగా విచారణల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

ఈ రెండు సంస్థలు మారిసస్‌కు చెందిన ఐక్యూ బ్రిడ్జ్‌ లిమిటెడ్‌, తన దేశీయ సబ్సిడరీ ఐక్యూ బ్రిడ్జ్‌ లిమిటెడ్‌, బెంగళూరు అని తెలిసింది. వీటిని విజయ్‌మాల్యా, యూబీ గ్రూప్‌ తన ఆధీనంలో నడిపించేదని తేలింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, డెక్కన్‌ ఏవియేషన్‌లో విలీనం కాకముందు ఈ రెండు సంస్థలు 15 లక్షలు, 52 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్టు రిపోర్టు పేర్కొంది. 2007-08 కాలంలో ఐక్యూ బ్రిడ్జ్‌ మారిసస్‌లో ఉన్న 99 షేర్లలో మాల్యా 89ని లిబేరియా రిజిస్ట్రేషన్‌ కలిగి లోమ్‌బార్డ్‌ వాల్ కార్పొరేట్ సర్వీసెస్ ఇంక్‌కు ట్రాన్సఫర్‌ చేసినట్టు సీఎఫ్‌ఐఓ నివేదికలో తెలిసిందని ఇండియన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. అంతేకాక యూనైటెడ్‌ బెవరీస్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు చెందిన ఓవర్‌సీస్‌ సబ్సిడరీ యూబీ ఓవర్‌సీస్‌ లిమిటెడ్‌, కింగ్‌ఫిషర్‌కు చెందిన 1.67 కోట్ల షేర్లను కొనుగోలుచేసినట్టు కూడా విచారణ నివేదికలు పేర్కొన్నాయి. వీటి విలువ రూ.50.02 కోట్లు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top