లుపిన్‌ నష్టాలు రూ.783 కోట్లు

Lupin slips to a Rs 7.8 bn loss in Q4 - Sakshi

ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌  

న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం లుపిన్‌కు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో రూ.784 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. గావిస్‌ కంపెనీ కొనుగోలు విషయంలో రూ.1,464 కోట్ల వన్‌టైమ్‌ ఇంపెయిర్‌మెంట్‌ చార్జీ కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని లుపిన్‌ ఎండీ నీలేశ్‌ గుప్తా తెలిపారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.381 కోట్ల నికర లాభం వచ్చినట్టు తెలిపారు.

మొత్తం ఆదాయం రూ.4,253 కోట్ల నుంచి రూ.4,034 కోట్లకు తగ్గిందని చెప్పారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.2,557 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 90 శాతం క్షీణించి రూ.251 కోట్లకు తగ్గిందని నీలేశ్‌ తెలిపారు.

మొత్తం ఆదాయం కూడా రూ.17,494 కోట్ల నుంచి రూ.16,804 కోట్లకు చేరిందని వివరించారు.  ఇండోర్, గోవా యూనిట్లపై అమెరికా ఎఫ్‌డీఏ జారీ చేసిన హెచ్చరిక లేఖలను పరిష్కరించడం... తమ సమీప కాలపు ప్రాధాన్యతలని పేర్కొన్నారు. అమెరికాలో సొలోసెక్‌ను విజయవంతంగా వాణిజ్యీకరించడం, సరైన ఔషధాలను మార్కెట్లోకి తేవడం కూడా ఈ జాబితాలో ఉన్నాయని వివరించారు.  

ఇంట్రాడేలో ఏడాది కనిష్టానికి:  బీఎస్‌ఈ ఇంట్రాడేలో ఈ షేర్‌ ఏడాది కనిష్ట స్థాయి, రూ.724ను తాకింది. చివరకు 0.4 శాతం నష్టంతో రూ.751 వద్ద ముగిసింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top