మొబైల్‌ పోయిందా? కేంద్రం గుడ్‌ న్యూస్‌

Lost your mobile phone new government portal Helps you - Sakshi

ఫిర్యాదులకు :  14422  హెల్ప్‌లైన్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో  టెలికాం విభాగం చర్యలు

 పైలట్‌ ప్రాజెక్టుగా మహారాష్ట్రలో పోర్టల్‌ లాంచ్‌

సాక్షి, న్యూఢిల్లీ: మీ మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్నారా? అయితే మీకు ఊరటనిచ్చే వార్త. తస్కరించిన ఫోన్ల ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగింది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమాన్ని చుట్టింది. 

దొంగిలించబడిన మొబైల్స్ రిపోర్టింగ్ కోసం కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్‌  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ www.ceir.gov.in అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.  సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఇఐఆర్)  పేరుతో  మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా,  బిఎస్‌ఎన్‌ఎల్ సహకారంతో దీన్ని ప్రారంభించారు. మొబైల్ ఫోన్ల,  రీగ్రామింగ్‌తో సహా భద్రత, దొంగతనం,  ఇతర సమస్యలను పరిష్కరించడానికి టెలికమ్యూనికేషన్‌ విభాగం (డీఓటీ‌) దీన్ని చేపట్టింది.కోల్పోయిన లేదా కొట్టేసిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను అన్ని నెట్‌ వర్క్‌లలో బ్లాక్‌ చేయడం,  మొబైల్‌ ఫోన్లలో కీలకమైన నకిలీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నిరోధించడం, నకిలీ మొబైల్ పరికరాల ఉపయోగాన్ని నిరోధించడం  ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలు. సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్ఈఐ డేటాబేస్ కు అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా డేటాబేస్‌లో ఉన్న ఇత‌ర‌ ఐఎంఈఐ సంఖ్యలతో పోల్చి నకిలీ హ్యాండ్‌సెట్‌లను గుర్తించడానికి అనుమతిస్తుంది.

ఫోన్‌ పోతే  ఫిర్యాదు ఎలా చేయాలి
మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా అది ఎవరైనా దొంగిలించినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆపై 14422 హెల్ప్‌లైన్ ద్వారా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్ (డాట్‌)కి తెలియజేయాలి.  దీంతో సత్త్వరమే డాట్‌ మీ ఫోన్‌ను బ్లాక్‌ చేస్తుంది. తద్వారా దొంగిలించిన వ్యక్తి లేదా మహిళ ఆ పరికరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో దీన్ని ఉప‌యోగించ‌డం కుద‌ర‌దు. ఈ వ్యవహారంలో బీఎస్ఎన్ఎల్,  రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లాంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ డాట్‌కు సహకరిస్తాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top