లెనోవో కొత్త అల్ట్రా స్లిమ్‌ ల్యాప్‌టాప్‌లు

Lenovo refreshes ultra-thin laptop portfolio in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ  కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీదారు లెనోవో రెండు  కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్‌ చేసింది. అల్ట్రా స్లిమ్‌  పోర్ట్‌ఫోలియో  ఐడియా ప్యాడ్‌ డివైస్‌లను  భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లెనోవో ఐడియా ప్యాడ్ 530ఎస్, ఐడియా ప్యాడ్ 330ఎస్ పేరిట ఈ ల్యాప్‌టాప్‌లను అందుబాటులో ఉంచింది.

లెనోవో ఐడియా ప్యాడ్ 530 ఎస్ పీచర్లు:14 ఇంచుల డిస్‌ప్లే, 8వ జనరేషన్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, ఎన్‌వీడియా ఎంఎక్స్ 150/ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 8 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.67,990గా ఉంది.

లెనోవో ఐడియాప్యాడ్ 330ఎస్ ఫీచర్లు:
15.6/14 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ 8వ జనరేషన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్1050/ఏఎండీ రేడియాన్ 535 గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, 1 టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, 7 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.35,990 గా ఉంది.

నిరంతరం నూతనమైన, డివైస్‌లను ఆవిష్కరించడంలో తన నిబద్దతను అల్ట్రా-స్లిమ్ పోర్ట్‌ఫోలియో మరోసారి నిరూపించిందని కస్టమర్ బిజినెస్ అండ్ ఇకామర్స్ లెనోవో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ తాదానీ తెలిపారు.  భారతీయ మార్కెట్ కోసం  సరసమైన ధరల్లో, అల్ట్రా పోర్టబుల్ ల్యాప్‌టాప్‌లను తీసుకువస్తున్నామని, తద్వారా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top