నాగార్జున ఆయిల్ సింగపూర్ కంపెనీ వశం? | Lenders want Nagarjuna Oil’s NPA classified standard asset | Sakshi
Sakshi News home page

నాగార్జున ఆయిల్ సింగపూర్ కంపెనీ వశం?

Jul 1 2015 12:17 AM | Updated on Sep 3 2017 4:38 AM

నాగార్జున ఆయిల్ సింగపూర్ కంపెనీ వశం?

నాగార్జున ఆయిల్ సింగపూర్ కంపెనీ వశం?

తమిళనాడులోని నాగార్జున ఆయిల్ కార్పొరేషన్‌కు (ఎన్‌వోసీఎల్) చెందిన ఆయిల్ రిఫైనరీ యూనిట్‌లోని 46.78 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సింగపూర్ కంపెనీ ముందుకొచ్చింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమిళనాడులోని నాగార్జున ఆయిల్ కార్పొరేషన్‌కు (ఎన్‌వోసీఎల్) చెందిన ఆయిల్ రిఫైనరీ యూనిట్‌లోని 46.78 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సింగపూర్ కంపెనీ ముందుకొచ్చింది. నాగార్జున ఆయిల్ రిఫైనరీ పేరుతో రూ. 25,000 కోట్లతో కడలూరులో ఎన్‌వోసీఎల్ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులోని పూర్తి వాటాను సింగపూర్‌కు చెందిన నెట్‌ఆయిల్ కంపెనీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఎన్‌వోసీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. కంపెనీ విలువను ఇంకా లెక్కించాల్సి ఉంది. 12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ నిధుల కొరతతో సతమతమవుతోంది. ఈ కొనుగోలు పూర్తయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎన్‌వోసీఎల్‌కి పెద్ద ఊరట లభించినట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement