కవాసకి ‘వెర్సిస్‌–ఎక్స్‌ 300’ | Kawasaki Versys-X 300 Launched In India, Priced At Rs. 4.60 Lakh | Sakshi
Sakshi News home page

కవాసకి ‘వెర్సిస్‌–ఎక్స్‌ 300’

Nov 27 2017 11:45 PM | Updated on Nov 27 2017 11:45 PM

Kawasaki Versys-X 300 Launched In India, Priced At Rs. 4.60 Lakh - Sakshi

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ‘కవాసకి మోటార్స్‌’ తాజాగా ‘వెర్సిస్‌–ఎక్స్‌ 300’ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4.6 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ముంబై/ఢిల్లీ). కంపెనీ నుంచి అందుబాటు ధరలో వస్తోన్న మూడో బైక్‌ ఇది. అడ్వెంచర్‌ టూరింగ్‌ మోటార్‌ సైకిల్స్‌ విభాగానికి చెందిన ఈ బైక్‌ను ఏ రోడ్డుపైనైనా ఏ సమయంలోనైనా మంచి పనితీరు కనబరచే విధంగా రూపొందించామని కంపెనీ తెలిపింది. పుణేలోని చకన్‌ ప్లాంటులో ఈ బైక్‌ను అసెంబుల్‌ చేస్తున్నామని పేర్కొంది. టూరింగ్‌ విభాగంలో తక్కువ ఇంజిన్‌ సామర్థ్యంతో (300 సీసీ) వస్తోన్న బైక్‌ ఇదని కవాసకి మోటార్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ యుటక యమషిట తెలిపారు. లాంగ్‌ ట్రావెల్‌ సస్పెన్షన్, వైడ్‌ రిచ్‌ బార్స్, లో–సిట్, 4–స్ట్రోక్‌ పారెలల్‌ ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్, హీట్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ వంటి పలు ఫీచర్లను కలిగిన ఈ బైక్‌ తన ప్రత్యేకతలతో కస్టమర్లను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 22 షోరూమ్‌లలో వెర్సిస్‌–ఎక్స్‌ 300 బైక్స్‌ బుకింగ్‌లను ప్రారంభించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement