ఆఫర్‌ నిలిపేయనున్న జియో! | Jio to stop Summer suprise offer | Sakshi
Sakshi News home page

ఆఫర్‌ నిలిపేయనున్న జియో!

Apr 6 2017 11:11 PM | Updated on Sep 5 2017 8:07 AM

ఆఫర్‌ నిలిపేయనున్న జియో!

ఆఫర్‌ నిలిపేయనున్న జియో!

సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్‌ను నిలిపేస్తున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది.

ముంబై: సమ్మర్‌ సర్‌ ప్రైజ్‌ ఆఫర్‌ను నిలిపేస్తున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో ఆఫర్‌ను వెనక్కు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ట్రాయ్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పింది. జియో ఈ ఆఫర్‌ను వెంటనే అందుబాటులో నుంచి తీసేసే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ఈ ప్లాన్‌కు రీచార్జ్‌ చేసుకున్నవారికి ఆఫర్‌ వర్తించనుంది.

ఈ నెల 15 లోపు 99 రూపాయలు చెల్లించి.. అదనంగా రూ.303తో గానీ, రూ.499 గానీ రీచార్జ్‌ చేసుకున్న వినియోగదారులకు మూడు నెలల పాటు సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ కింద ఫ్రీ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, 4జీ మొబైల్‌ డేటా అందిస్తామని మార్చిలో జియో ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement