జియో మాన్‌సూన్‌ ఆఫర్‌ : రూ.1095 చెల్లించాలి

జియోఫోన్‌ మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ - Sakshi

జియోఫోన్‌ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌.. అదేనండి మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఈ నెల ప్రారంభంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి జియోస్టోర్లు, అధికారిక రిటైల్‌ పార్టనర్ల వద్ద ఈ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. వర్కింగ్‌ కండీషన్‌లో ఉన్న పాత ఫీచర్‌ ఫోన్‌ను ఇచ్చేసి, జియోఫోన్‌ను కేవలం రూ.501కే కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ మొత్తాన్ని కూడా మూడేళ్ల తర్వాత రీఫండ్‌ చేయనున్నామని కూడా పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌పై ఇంకా ఎక్కువ వివరాలను కంపెనీ రివీల్‌ చేయలేదు.  అయితే దీనికోసం కస్టమర్లు మొత్తంగా ఎంత చెల్లించాలి అనేది ప్రస్తుతం కంపెనీ అధికారిక కమ్యూనికేషన్‌లో తెలిపింది. కొత్త జియోఫోన్‌ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను పొందాలంటే కచ్చితంగా రూ.594ను కూడా చెల్లించాలట. ఈ మొత్తం ఆరు నెలల పాటు డేటా, వాయిస్‌ కాల్స్‌ పొందడం కోసం ఉపయోగపడుతుంది. 

ఈ మొత్తాన్ని కూడా కొత్త జియోఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడే చెల్లించాలని తెలిసింది. దీంతో మొత్తంగా కొత్త జియోఫోన్‌ ధర 1095 రూపాయల నుంచి 501 రూపాయలకు పెరుగుతుంది. ఈ అదనపు రూ.594 మొత్తంతో.. 99 రూపాయలతో ఆరు బ్యాక్‌-టూ-బ్యాక్‌ రీఛార్జ్‌లు పొందవచ్చు. రూ.99 ప్యాక్‌పై అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 0.5జీబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌ మెసేజ్‌లను 28 రోజుల వాలిడిటీలో పొందనున్నారు. దీంతో పాటు రూ.101 విలువైన 6 జీబీ బోనస్‌ డేటా ఓచర్‌ కూడా కస్టమర్లకు లభిస్తుంది. దీంతో మొత్తంగా 6 నెలల పాటు 90 జీబీ డేటా ప్రయోజనాలు పొందనున్నారు. ప్రస్తుతం రెండు జియోఫోన్‌ ప్లాన్లు మాత్రమే మార్కెట్‌లో ఉన్నాయి. ఒకటి 49 రూపాయలు. రెండు 153 రూపాయలు. 153 రూపాయల ప్లాన్‌ అత్యధిక అమ్ముడుపోతున్న ప్లాన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top