breaking news
Jio offer
-
జియో మాన్సూన్ ఆఫర్ : రూ.1095 చెల్లించాలి
జియోఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్.. అదేనండి మాన్సూన్ హంగామా ఆఫర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ నెల ప్రారంభంలో జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి జియోస్టోర్లు, అధికారిక రిటైల్ పార్టనర్ల వద్ద ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. వర్కింగ్ కండీషన్లో ఉన్న పాత ఫీచర్ ఫోన్‌ను ఇచ్చేసి, జియోఫోన్‌ను కేవలం రూ.501కే కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ మొత్తాన్ని కూడా మూడేళ్ల తర్వాత రీఫండ్ చేయనున్నామని కూడా పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌పై ఇంకా ఎక్కువ వివరాలను కంపెనీ రివీల్ చేయలేదు. అయితే దీనికోసం కస్టమర్లు మొత్తంగా ఎంత చెల్లించాలి అనేది ప్రస్తుతం కంపెనీ అధికారిక కమ్యూనికేషన్లో తెలిపింది. కొత్త జియోఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పొందాలంటే కచ్చితంగా రూ.594ను కూడా చెల్లించాలట. ఈ మొత్తం ఆరు నెలల పాటు డేటా, వాయిస్ కాల్స్ పొందడం కోసం ఉపయోగపడుతుంది. ఈ మొత్తాన్ని కూడా కొత్త జియోఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడే చెల్లించాలని తెలిసింది. దీంతో మొత్తంగా కొత్త జియోఫోన్ ధర 1095 రూపాయల నుంచి 501 రూపాయలకు పెరుగుతుంది. ఈ అదనపు రూ.594 మొత్తంతో.. 99 రూపాయలతో ఆరు బ్యాక్-టూ-బ్యాక్ రీఛార్జ్‌లు పొందవచ్చు. రూ.99 ప్యాక్‌పై అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 0.5జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ మెసేజ్‌లను 28 రోజుల వాలిడిటీలో పొందనున్నారు. దీంతో పాటు రూ.101 విలువైన 6 జీబీ బోనస్ డేటా ఓచర్ కూడా కస్టమర్లకు లభిస్తుంది. దీంతో మొత్తంగా 6 నెలల పాటు 90 జీబీ డేటా ప్రయోజనాలు పొందనున్నారు. ప్రస్తుతం రెండు జియోఫోన్ ప్లాన్లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. ఒకటి 49 రూపాయలు. రెండు 153 రూపాయలు. 153 రూపాయల ప్లాన్ అత్యధిక అమ్ముడుపోతున్న ప్లాన్. -
జియో బొనాంజా
-
జియోపై దిగ్గజాల కౌంటర్ అటాక్
డేటా రేట్ల కోత దిశగా అడుగులు కోల్ కత్తా : దాదాపు దశాబ్దం తర్వాత టెలికాం పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో దిగ్గజాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా జియో టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ, ప్రైమ్ మెంబర్ షిప్ పేరుతో మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో టెల్కోలు తమ హై ఎండ్ కస్టమర్లను అలానే అట్టిపెట్టుకోవడానికి, జియోకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు వెంటనే డేటా రేట్ల కోతకు పిలుపు ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రి విశ్లేషకులు చెబుతున్నారు. రూ.99 ప్రైమ్ మెంబర్ షిప్ ఫీజుతో పాటు, నెలకు మరో రూ.303లు చెల్లిస్తే హ్యాపీ న్యూఇయర్ కింద ప్రస్తుతం లభిస్తున్న ఉచిత డేటా, ఉచిత కాలింగ్ వంటి అన్ని ప్రయోజనాలను ఏడాదిపాటు పొందవచ్చని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం ప్రకటించారు. ఈ తాజా ప్రకటనతో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టాప్-ఎండ్ కస్టమర్లు, ఇప్పటికే జియోను రెండో సిమ్ గా వాడుతున్న వారిని అంబానీ టార్గెట్ చేసినట్టు తెలిసింది. దీంతో తమ టాప్-ఎండ్ కస్టమర్లను కాపాడుకోవడంలో టెల్కోలు సిద్ధమయ్యాయి. ఈ టాప్-ఎండ్ కస్టమర్లే టెల్కోలకు 60 శాతం రెవెన్యూలకు పైగా అందిస్తున్నాయని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం టెల్కోలు అందిస్తున్న డేటా ఛార్జీలు ఎయిర్ టెల్ : రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటా వొడాఫోన్ : రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటా ఐడియా : రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటా 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటా బీఎస్ఎన్ఎల్ : రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటా వీటన్నింటికీ ఝలకిస్తూ జియో రూ.303కే నెలకు అపరిమిత కాలింగ్ ను, రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రస్తుత కస్టమర్లకే అందనుంది. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు రిలయన్స్ అధినేత ప్రకటించారు. దీంతో దిగ్గజాలు సైతం పైన పేర్కొన్న డేటా రేట్లను మరింత తగ్గించేందుకు యోచిస్తున్నాయి.