సగం ధరకే విమాన టికెట్లు  | Jet Airways Offers Up To 50 percent Discount On Flight Tickets | Sakshi
Sakshi News home page

సగం ధరకే విమాన టికెట్లు 

Feb 22 2019 10:39 AM | Updated on Feb 22 2019 11:03 AM

Jet Airways Offers Up To 50 percent Discount On Flight Tickets - Sakshi

సాక్షి, ముంబై : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేటురంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ మరోసారి డిస్కౌంట్‌ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 50శాతం దాకా డిస్కౌంట్‌ అందిస్తోంది. దాదాపు సగం ధరకే  టిక్కెట్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 25 వరకు ఈ డిస్కౌంట్‌ ధరలు అందుబాటులో ఉంటాయి. ప్రీమియం, ఎకానమి క్లాస్ సీట్లకు కూడా ఈ తగ్గింపు ధరలు వర్తించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు ఈ నెల 21 నుంచి, దేశీయ ప్రయాణికులు  మార్చి1 నుంచి ప్రయాణం చేయవచ్చునని  వెల్లడించింది.  అలాగే ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు కచ్చితంగా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని  స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement